Kothakota Dayakar Reddy
Kothakota Dayakar Reddy: మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం మరింత క్షీణించడంతో మంగళవారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. దయాకర్ రెడ్డి స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం పర్కపురం గ్రామం. దయాకర్ రెడ్డి మూడు సార్లు టీడీపీ తరపున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1994, 1999లో అమరచింత నియోజకవర్గం నుండి రెండు సార్లు, నియోజకవర్గాల పున:విభజన తరువాత 2009లో మక్తల్ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచి విజయం సాధించారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలోపేతంకు కృషిచేసిన వారిలో దయాకర్ రెడ్డి ఒకరు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగానూ దయాకర్ రెడ్డి పనిచేశారు.
Dayakar Reddy Passed away: మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్‌రెడ్డి కన్నుమూత
దయాకర్ రెడ్డి మృతిపట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిసహా పలువురు సంతాపం తెలిపారు. దయాకర్ రెడ్డి మృతి వార్త తనను ఎంతో బాధకు గురిచేసిందని చంద్రబాబు నాయుడు తెలిపారు. దయాకర్‌రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కొద్దికాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న దయాకర్ రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు ప్రాణాలు విడవడం బాధాకరం. నిత్యం ప్రజల్లో ఉంటూ సమర్థుడైన నాయకుడుగా దయాకర్ రెడ్డిపేరు తెచ్చుకున్నారు. దయాకర్ రెడ్డి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని చంద్రబాబు తెలిపారు.
Blood Donation : రక్తదానం చేయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే !
దయాకర్ రెడ్డి మృతిపట్ల టీడీపీ నేత నారా లోకేష్ సంతాపం తెలిపారు. వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నానని, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని లోకేశ్ తెలిపారు. అదేవిధంగా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దయాకర్ రెడ్డి మృతిపట్ల సంతాపం తెలిపారు. దయాకర్ రెడ్డి మరణం తెలుగుదేశం పార్టీకి తీరని లోటు అన్నారు. దయాకర్ రెడ్డి, ఆయన కుటుంబంతో నాకు ఎంతో సన్నిహితం ఉందని, వారు నాకు మంచి మిత్రులు అని, ఆత్మీయున్ని కోల్పోయినందుకు బాధగా ఉందని బాలకృష్ణ అన్నారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని, వారి కుటుంబ సభ్యులకు బాలకృష్ణ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
Minister Roja: ఇంకా ఆస్పత్రిలోనే మంత్రి రోజా.. కొనసాగుతున్న చికిత్స..
దయాకర్ రెడ్డి మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఒక మంచి మిత్రుణ్ణి కోల్పోయాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా అని అన్నారు. ఒక మంచి ప్రజా నాయకుడు దయాకర్ రెడ్డి మరణం తెలంగాణ ప్రజానీకానికి తీరని లోటు అని రేవంత్ అన్నారు. నిత్యం ప్రజల మధ్య ఉండి జనంకోసం పోరాడే నేత దయాకర్ రెడ్డి అని కొనియాడారు. దయాకర్ రెడ్డి కుటుంబానికి రేవంత్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.