Chandrababu : తెలంగాణ పోరాటంలో గద్దర్ పాత్ర మరువలేనిది.. గద్దర్ కుటుంబసభ్యులను పరామర్శించిన చంద్రబాబు

ప్రజా చరిత్రలో మొదటగా గుర్తు వచ్చే వ్యక్తి గద్దర్ అని అన్నారు. నిరంతరం పోరాటం చేసిన వ్యక్తి గద్దర్ అని కొనియాడారు. పేద వాళ్ల హక్కులు పరిరక్షించాలని కృషి చేసిన వ్యక్తి అన్నారు.

Chandrababu visit Gaddar family

Chandrababu Visit Gaddar Family Members : గద్దర్ చనిపోవడం చాలా బాధాకరమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. గద్దర్ ఎన్నో ప్రజా పోరాటాలకు నాంది పలికారని తెలిపారు. తెలంగాణ పోరాటంలో గద్దర్ పాత్ర మరువలేనిదని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో గద్దర్ పాత్ర కీలకం అన్నారు. ప్రజాయుద్ధ నౌక పేరు వింటే గద్దర్ గుర్తొస్తారని పేర్కొన్నారు. గద్దర్ జీవితం బావి తరాలకు ఆదర్శం అన్నారు. గద్దర్ చనిపోయిన ఆయన స్ఫూర్తి శాశ్వతంగా ఉంటుందన్నారు.

సికింద్రాబాద్ అల్వాల్ లోని గద్దర్ ఇంటికి వెళ్లిన చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. చంద్రబాబు వెంట టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు కాకాని జ్ఞానేశ్వర్, ఇతర నేతలు ఉన్నారు. ఈ మేరకు చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలని ఆయన ఒక పంథాను ఎంచుకుని ప్రజా చైతన్యం చేశారని తెలిపారు.

Gaddar : గద్దర్ ఎక్కడికి వెళ్లినా చేతిలో కర్ర ఉండాల్సిందే.. అది ఎవరిచ్చారో తెలుసా?

ఎన్నో పోరాటాలకు గద్దర్ నాంది పలికారని తెలిపారు. తెలంగాణ సాయుధ పోరాటంలో, తెలంగాణ మలి దశ పోరాటంతోపాటు అన్నీ పోరాటాల్లో ముందుండి పాల్గొన్నారు. గద్దర్ ను చూస్తే ప్రజా యుద్ధనౌక గుర్తుకు వస్తుందన్నారు. పోరాటాలను ఊపిరి, ప్రాణంగా చేసుకున్నాడని తెలిపారు. గద్దర్ కు లక్షలామంది అభిమానులు ఉన్నారని తెలిపారు. దానికి కారణం ఆయన చూపిన చొరవ, చేసిన త్యాగాలు అని అన్నారు.

ప్రజా చరిత్రలో మొదటగా గుర్తు వచ్చే వ్యక్తి గద్దర్ అని అన్నారు. నిరంతరం పోరాటం చేసిన వ్యక్తి గద్దర్ అని కొనియాడారు. పేద వాళ్ల హక్కులు పరిరక్షించాలని కృషి చేసిన వ్యక్తి అన్నారు. గద్దర్ చనిపోయినా ఆయన స్ఫూర్తి మరువలేనిదని చెప్పారు. సమాజం కోసం పని చేసే వ్యక్తిని కోల్పోవడం బాధాకరం అన్నారు. చాల ఉద్యమాల్లో తాను, గద్దర్ కలిసి పని చేశామని తెలిపారు.

Pawan Kalyan – Gaddar : గద్దర్ పై పవన్ ప్రత్యేక కావ్యం.. నా అన్న ప్రజా యుద్ధనౌక గద్దర్.. వీడియో వైరల్!

గద్దర్ పేదల కోసం పోరాటం చేశారు, తాను కూడా పేదల అభివృద్ధి కోసం పని చేశానని తెలిపారు. తన గురించి ఆయనకు, ఆయన గురించి నాకు తెలుసన్నారు. 1997లో గద్దర్ పై కాల్పులు ఘటనపై చంద్రబాబు స్పందించారు. గద్దర్ ను భయం అంటే తెలియని వ్యక్తిగా చంద్రబాబు అభివర్ణించారు. గద్దర్ పై కాల్పులు విషయంలో కొన్ని అపోహలు ఉన్నాయని తెలిపారు.

కాల్పుల ఘటనకు సంబంధించి తనపై తప్పు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. కాల్పుల ఘటన తర్వాత గద్దర్ తనతో అనేక సార్లు మాట్లాడారని గుర్తు చేశారు. తన లక్ష్యం.. గద్దర్ లక్ష్యం ఒక్కటేనేనని పేదల హక్కుల పరిరక్షణమే తమ ధ్యేయం అన్నారు. హైదరాబాద్ అభివృద్దికి కారణం ఎవరో అందరీ తెలుసన్నారు. హైదరాబాద్ అభివృద్ధి ఫలాలు తెలంగాణలో ప్రతి ఒక్కరకీ అందుతున్నాయని తెలిపారు.