CM KCR – Bhim Army : భీం ఆర్మీ మహాసభలకు సీఎం కేసీఆర్ కు ఆహ్వానం

ఆగస్టు26న జైపూర్ లో జరిగే భీం ఆర్మీ మహాసభలకు ముఖ్య అతిథిగా సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను చంద్రశేఖర్ ఆజాద్ కలిశారు.

CM KCR – Bhim Army : భీం ఆర్మీ మహాసభలకు సీఎం కేసీఆర్ కు ఆహ్వానం

Chandrasekhar Azad invite KCR

Updated On : July 29, 2023 / 12:35 AM IST

Chandrasekhar Azad Invite KCR : భీం ఆర్మీ మహాసభలకు తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఆహ్వానించారు. హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో కేసీఆర్ ను కలిసిన భీం ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ మహాసభలకు ఆహ్వానించారు. ఆగస్టు26న జైపూర్ లో జరిగే భీం ఆర్మీ మహాసభలకు ముఖ్య అతిథిగా సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. అంతకముందు గురువారం(జులై27,2023)న హైదరాబాద్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను చంద్రశేఖర్ ఆజాద్ కలిశారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను ఢిల్లీలో నిరసన తెలిపినప్పుడు కవిత అక్క బీఆర్ఎస్ ఎంపీలను పంపించి మద్దతు తెలిపారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం అట్టడుగు వర్గాల ప్రజల అభివృద్ధికి కృషి చేస్తుందని తెలిపారు. కొత్త సచివాలయానికి డా.బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం సంతోషకరమని కొనియాడారు.

Revanth Reddy Missing Posters : రేవంత్ రెడ్డి మిస్సింగ్ అంటూ హైదరాబాద్ లో పోస్టర్లు

కొత్త పార్లమెంట్ లో అంబేద్కర్ విగ్రహం పెట్టాలన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యంత ఎతైన అంబేద్కర్ విగ్రహాన్ని సందర్శించేందుకు ఆజాద్ ఇక్కడకు వచ్చారని తెలిపారు. ఆజాద్ కు తెలంగాణ ప్రజల మద్దతు ఉంటుందని పేర్కొన్నారు.

ఆజాద్ తన పోరాటంలో ముందుకు వెళ్లాలని, ఆయన వెంట తాము ఉంటామని భరోసా ఇచ్చారు. ఎన్నో ఏళ్లపాటు పోరాడి తెలంగాణ సాధించుకున్నామని పేర్కొన్నారు. అట్టడుగు వర్గాల ప్రజల కోసం కేసీఆర్ నిబద్ధతో పని చేస్తున్నారని కొనియాడారు.