Chicken Shops Close: చికెన్ లవర్స్‌కి బ్యాడ్ న్యూస్.. నేటి నుంచి చికెన్ షాపులు బంద్.. ఎందుకు, ఎప్పటివరకు అంటే
పౌల్ట్రీ కంపెనీలు దిగివచ్చే వరకు బంద్ కొనసాగిస్తామని తెలంగాణ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది.
- Naveen
- Updated on- April 1, 2026 / 12:27 AM IST
Chicken Shops Close: తెలంగాణలో చికెన్ ప్రియులకు ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే ఏప్రిల్1 నుంచి రాష్ట్రంలో చికెన్ షాపులు బంద్ కానున్నాయి. పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్ తగ్గించాయని తెలంగాణ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అందుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. చికెన్ విక్రయాల్లో మార్జిన్ పెంచాలని అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. తగ్గించిన మార్జిన్ పెంచే వరకు నిరవధిక బంద్ కొనసాగుతుందని తేల్చి చెప్పింది. పౌల్ట్రీ కంపెనీలు దిగివచ్చే వరకు బంద్ కొనసాగిస్తామని తెలంగాణ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది.
గతంలో పౌల్ట్రీ కంపెనీలు 1.8% మార్జిన్ ఇచ్చేవని, ప్రస్తుతం 1.5% మాత్రమే ఇవ్వడంతో తమకు నష్టం వస్తోందని షాపుల ఓనర్లు వాపోతున్నారు. పౌల్ట్రీ కంపెనీలు దిగిరావాల్సిందేనని మార్జిన్ పెంచాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. అప్పటివరకు నిరవధిక బంద్ ఉంటుందని తెలంగాణ చికెన్ షాపు ఓనర్స్ అసోసియేషన్ తెలిపింది.
పౌల్ట్రీ కంపెనీల నుంచి చికెన్ షాపులకు మార్జిన్ పెంచాలని కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. పౌల్ట్రీ కంపెనీలపై ఒత్తిడి పెంచేందుకు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న చికెన్ షాపుల నిర్వాహకులు నిరవధిక బంద్ కు పిలుపునిచ్చారు. కొన్ని రోజుల క్రితమే హైదరాబాద్ నగరంలోని చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ మార్జిన్ పెంచాలని డిమాండ్ చేసింది. అయితే, చికెన్ షాపులకు కోళ్లను సరఫరా చేసే పౌల్ట్రీ కంపెనీల నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు. డిమాండ్స్ గురించి మాట్లాడింది లేదు. దీంతో చికెన్ షాప్ ఓనర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా చికెన్ షాపులు బంద్ చేయాలని నిర్ణయించారు. కస్టమర్లు సైతం తమకు సహకరించాలని తెలంగాణ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది.
Also Read: వావ్ సూపర్… వారందరికీ రెడీమేడ్ ఇందిరమ్మ ఇళ్లు.. భూకంపాలను తట్టుకునే టెక్నాలజీతో
చికెన్ షాపులు బంద్ కానున్నాయని తెలిసి చికెన్ లవర్స్ తీవ్ర ఆవేదన చెందుతున్నారు. కొంతమందికి చికెన్ లేనిదే ముద్ద దిగదు. ఇక సండే, ఏదైనా అకేషన్ వచ్చిందంటే కచ్చితంగా ముక్క ఉండాల్సిందే. రేపటి నుంచి చికెన్ దొరకదని తెలిసి అలాంటి వారంతా తెగ వర్రీ అవుతున్నారు. ఇక, చికెన్ షాపుల బంద్ ఎఫెక్ట్ హోటల్స్ పైనా పడనుంది. చికెన్ షాపులు బంద్ అయితే హోటళ్లలో కూడా చికెన్ ఐటమ్స్ కూడా దొరికే పరిస్థితి ఉండదు.
