Chirumarthy Lingaiah : నా హత్యకు కుట్ర పన్నారు..? కోమటరెడ్డి బ్రదర్స్ పై ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు

కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయ బ్రోకర్లు. ప్రజలు వాళ్లకు రాజకీయ సమాధి కడతారు. నా నియోజకవర్గంలో నాయకులను డబ్బుతో కొంటున్నారు. నాకు మంత్రి పదవి రాకుండా అడ్డుకున్నారు.Chirumarthy Lingaiah

Chirumarthy Lingaiah : నా హత్యకు కుట్ర పన్నారు..? కోమటరెడ్డి బ్రదర్స్ పై ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు

Chirumarthi Lingaiah Sensational Allegations

Chirumarthy Lingaiah Sensational Allegations : కోమటిరెడ్డి బ్రదర్స్ పై నిప్పులు చెరిగారు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. నల్గొండ జిల్లా నకిరేకల్ మండలంలోని పాలెం నోముల గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన లింగయ్య.. కోమటిరెడ్డి బ్రదర్స్ కు ప్రజలు రాజకీయ సమాధి కట్టే రోజు దగ్గరలోనే ఉందన్నారు. తన నియోజకవర్గంలోని పార్టీ నేతలను డబ్బుతో కొంటున్నారని ఆరోపించారు.

వారి నుంచి నాకు ప్రాణహాని ఉంది-చిరుమర్తి లింగయ్య
తనను హత్య చేసేందుకు కోమటరెడ్డి సోదరులు కుట్ర పన్నుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు చిరుమర్తి లింగయ్య. వారిద్దరి నుంచి తనకు ప్రాణహాని ఉందన్నారు. తన నియోజకవర్గ ప్రజలు తనను కాపాడుకుంటారని అన్నారు. కోమటరెడ్డి బ్రదర్స్ ఓటమి కోసం నల్గొండ, మునుగోడులో తాను ప్రచారం చేస్తానన్నారు. 2014లో తాను ఓడిపోవడానికి కారణం కోమటిరెడ్డి బ్రదర్స్ అన్న చిరుమర్తి.. తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు.

Also Read : దోచుకోవడం కోసమే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం, సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలి- కిషన్ రెడ్డి డిమాండ్

కోమటిరెడ్డి బ్రదర్స్ పై ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తీవ్ర ఆరోపణలు..
కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయ బ్రోకర్లు. ప్రజలు వాళ్లకు రాజకీయ సమాధి కడతారు. నకిరేకల్ నియోజకవర్గంలో నాయకులను డబ్బుతో కొంటున్నారు. నన్ను హత్య చేయడానికి కుట్ర చేస్తున్నారు. వారి నుంచి నాకు ప్రాణహాని ఉంది. ప్రజలు నన్ను కాపాడుకుంటారు. కోమటిరెడ్డి బ్రదర్స్ ఓటమి కోసం నల్గొండ, మునుగోడులో నేను ప్రచారం చేస్తాను. నల్గొండలో బొడ్డుపల్లి శీను హత్యలో వేముల వీరేశం, కోమటిరెడ్డి బ్రదర్స్ కు సంబంధం ఉంది. 2014లో నేను ఓడిపోవడానికి కారణం కోమటిరెడ్డి బ్రదర్స్. నాకు మంత్రి పదవి రాకుండా అడ్డుపడ్డది కూడా కోమటిరెడ్డి బ్రదర్స్. డబ్బుతో రాజకీయాలు చేస్తున్నారు. ప్రజల సొమ్మును దోచుకుంటున్నారు. దళితుడిని కాబట్టే నా ఎదుగుదలను ఓర్వలేక నన్ను ఓడించడానికి ప్రయత్నిస్తున్నారు.

Also Read : ఆ నెంబర్ నుంచి వీడియో కాల్ వచ్చిందా? లిఫ్ట్ చేశారో ఇక అంతే- పోలీసుల వార్నింగ్