Kishan Reddy : దోచుకోవడం కోసమే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం, సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలి- కిషన్ రెడ్డి డిమాండ్

ప్రపంచంలో అతి పెద్ద ప్రాజెక్టుకు నాణ్యత లేని ఇసుక వాడారు. ఇంజనీర్లు చెప్పినా సీఎం కేసీఆర్ వినకుండా ప్రాజెక్టు నిర్మాణం చేసినందుకే ఇలా జరిగింది. Kishan Reddy

Kishan Reddy : దోచుకోవడం కోసమే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం, సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలి- కిషన్ రెడ్డి డిమాండ్

Kishan Reddy On CM KCR (Photo : Google)

Updated On : November 3, 2023 / 8:16 PM IST

Kishan Reddy On CM KCR : తెలంగాణ సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల లబ్ది పొందింది కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రమే అని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఈ ప్రాజెక్ట్ సామాన్య ప్రజల జేబులకు చిల్లులు పెట్టిందన్నారు. ”నాలుగేళ్లలోనే పిల్లర్లు కుంగిపోయాయని, కొత్త బ్యారేజీ నిర్మాణం చేపట్టాలని ఇంజనీర్లు చెబుతున్నారు. కేవలం తెలంగాణ ప్రజలను దోచుకోవడం కోసమే ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. నాసిరకంగా, నాణ్యత లేకుండా కట్టారు. ప్రభుత్వం దీనిపై కనీసం మాట్లాడే పరిస్థితి లేదు.

ఈ ప్రాజెక్టు కాస్ట్ ఎంత? ఎవరు కడుతున్నారో కూడా తెలియదు. ఎకరాకు 85వేల కోట్ల రూపాయల మెయింటైనెన్స్ కాస్ట్ అవుతుంది. కానీ వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయం కేవలం 40 వేలే. ఈ ప్రాజెక్టు ఎవరి కోసం, ఎందుకోసం కట్టారు? ఆర్థికంగా తెలంగాణ ప్రజలపై భారం మోపే ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్ట్.

లక్ష్మీ బ్యారేజి కూలినప్పుడు నేను జీవశక్తి శాఖకు ఫిర్యాదు చేశా. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో డ్యాం సేఫ్టీ అథారిటీ ఏర్పాటు చేశాం. దేశ వ్యాప్తంగా అన్ని ప్రాజెక్టులను ఈ అథారిటీ స్టడీ చేస్తుంది. ఈ సంస్థ ఆధ్వర్యంలో ఆరుగురు సభ్యులు డ్యాం వద్దకు వచ్చారు. ప్రాజెక్టుపై పూరి వివరాలు అధ్యయనం చేసి రిపోర్ట్ అందజేశారు. 22 అంశాలను అడిగితే 11 అంశాలకు సమాధానం చెప్పారు. 27న కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికు ప్రాజెక్టు వివరాలు చెప్తే ప్రాజెక్ట్ భద్రతకు సూచనలు చేస్తామని చెప్పింది. 9 అంశాలకు సంబంధించిన రిపోర్టులు ఇవ్వలేదు. మా దగ్గర కనీసం సమాచారం లేదంటూ చెప్పడం దురదృష్టకరం.

ప్లానింగ్, డిజైనింగ్, క్వాలిటీ సరిగా లేకనే కుంగింది అని రిపోర్ట్ వచ్చింది. ఫౌండేషన్ సరిగా లేదని డ్యాం సేఫ్టీ అథారిటీ తెలిపింది. ఫౌండేషన్ కోసం సింగిల్ స్టోన్ వాడటం కూడా ప్రమాదానికి కారణం. ప్రపంచంలో అతి పెద్ద ప్రాజెక్టుకు నాణ్యత లేని ఇసుక వాడారు. ఇంజనీర్లు చెప్పినా సీఎం కేసీఆర్ వినకుండా ప్రాజెక్టు నిర్మాణం చేసినందుకే ఇలా జరిగింది. మేడిగడ్డ ప్రాజెక్టు కాళేశ్వరంకు లైఫ్ లైన్. ఇక్కడ నీరు లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా నిరుపయోగమే. నిజాయితీ ఉంటే ప్రాజెక్టు కుంగిపోవడానికి కారణమైన ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీనామా చేయాలి. దీనిపై సమగ్రమైన విచారణ జరపాలి.

ప్రాజెక్టు భవిష్యత్తుపై ఏం చేస్తారో ప్రభుత్వం సమాధానం చెప్పలేదు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు తీరని నష్టం చేకూర్చే అవకాశం ఉందని రిపోర్ట్ చెప్పింది. నిర్దిష్టమైన సమయానికి కేంద్ర ప్రభుత్వం అడిగిన వివరాలు ఇవ్వాలి. వివరాలు లేకపోతే మరింత తీవ్రమైన నేరంగా పరిగణించాలి. బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టు లోపాలపై పూర్తి స్థాయి విచారణ చేస్తాం. బాధ్యులు ఎంతటి వారైనా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటాం.