Khammam District
Khammam District : వర్షంలో తడవడం అంటే అందరికీ ఇష్టం. అదీ సీజన్ స్టార్ట్ అయ్యాక రెండు మూడు రోజులు. ఆ తరువాత విద్యార్ధులకి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి వర్షం పెద్ద అడ్డంకిగా మారుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో దాచిపెట్టినవో, కొత్తగా కొన్నవో గొడుగులు, రెయిన్ కోట్లు వాడతాం. ఎంత వాటిని వాడినా తడవడం మాత్రం ఖాయం. ఇక విషయానికి వస్తే ఖమ్మంజిల్లాకు చెందిన ఓ పదవతరగతి విద్యార్ధి వర్షంలో తడవకుండా తన సైకిల్‌పై రక్షణ కవచాన్ని ఎలా తయారు చేసుకున్నాడో చూడండి.
సైకిల్ మీద స్కూళ్లకి, పనులకి వెళ్లే వాళ్లు ఉంటే వారికి ఉపయోగపడేలా ఉంది ఖమ్మం బాలుడి ఐడియా. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పొన్నెకల్లు ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్న రహీం రోజూ వర్షంలో తడుస్తూ స్కూలుకి వెళ్తున్నాడు. ఇలా కాకుండా ఏదో ఒకటి చేయాలని ఆలోచించాడు. అంతే కొన్ని కర్రలు, బస్తా కవర్లతో ఓ రక్షణ కవచాన్ని తయారు చేసేసాడు. ఇంకేముంది.. వర్షం వచ్చినా తడవకుండా సైకిల్‌పై హ్యాపీగా స్కూల్ కి వెళ్తున్నాడు.
Viral Video: రహస్యంగా 30 క్షణాల్లో ఆ బాలుడు చేసిన ఈ పనికి రెస్టారెంటుకు రూ.946 కోట్ల నష్టం
ఇక రహీం తయారు చేసుకున్న రక్షణ కవచం చూసి ఊర్లో వాళ్లు భలే ముచ్చట పడుతున్నారు. బాలుడి తెలివితేటలకు భళా అంటున్నారు. ఇలాంటి చిన్న చిన్న ప్రయోగాలే.. రేపు పెద్ద ఆవిష్కరణలకు పునాదులు అవుతాయి. రహీంని చూస్తుంటే భవిష్యత్తులో రాణిస్తాడని అందరూ అభినందిస్తున్నారు. మీకు సైకిల్ ఉంటే ఈ ఐడియా ఫాలో అయిపోండి. ఈ సీజన్‌లో ఈ ఐడియా తడవకుండా వర్కౌట్ అవ్వచ్చు.