Dr Tarun Joshi IPS : ఎవరెస్ట్ ఎక్కడమే రాచకొండ కొత్త సీపీ టార్గెట్ అట..ఇప్పటికి 6 పర్వతాలు అధిరోహించి పోలీస్ బాస్
ఓ వైపు విధులు నిర్వహిస్తూనే మరోవైపు తనకెంతో ఇష్టమైన పర్వతాలు అధిరోహిస్తున్నారు రాచకొండ పోలీస్ కమిషనరేట్ కొత్త కమిషనర్‌గా నియమితులైన డాక్టర్ తరుణ్ జోషి.. ఇప్పటివరకు ఆయన ఎన్ని పర్వతాలు ఎక్కారో తెలుసా?

Dr Tarun Joshi IPS 3
Dr Tarun Joshi IPS : రాచకొండ పోలీస్ కమనిషనరేట్ కొత్త కమిషనర్‌గా నియమితులైన డాక్టర్ తరుణ్ జోషికి పర్వతాలు ఎక్కడం అంటే మహా ఇష్టమట. ఇప్పటికే 6 పర్వతాలను అలవోకగా ఎక్కేసిన ఆయన టార్గెట్ మాత్రం ఎవరెస్టేట.. ఆ దిశగా సాధన చేస్తున్నారు తరుణ్ జోషి.

Dr Tarun Joshi IPS 1
పంజాబ్‌కు చెందిన తరుణ్ జోషి.. పాటియాలాలోని గవర్నమెంట్ కాలేజీలో బీడీఎస్ చదువుకున్నారు. ఆ తర్వాత డెంటల్ సర్జన్‌గా పనిచేసారు. 2004 లో సివిల్ సర్వీస్ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌లో ఐపీఎస్ అధికారిగా బాధ్యతలు చేపట్టారు. ఉస్మానియా యూనివర్సిటీ నుండి పోలీస్ మేనేజ్మెంట్ విభాగంలో మాస్టర్స్ పూర్తి చేసారు. 2019 లో ఎల్ఎల్‌బీ పాసై యూనివర్సిటీ టాపర్‌గా నిలిచారు. ఓ వైపు చదువు.. మరోవైపు విధులు.. కొనసాగిస్తూనే తరుణ్ జోషీ తన ఇష్టాలను మాత్రం పక్కన పెట్టలేదు.
Rare Wild Cat : ఎవరెస్టు శిఖరంపై అత్యంత అరుదైన పిల్లి
2014-2016 వరకు తరుణ్ జోషీ ఆదిలాబాద్ జిల్లా ఎస్పీగా విధులు నిర్వహించారు. ఈ సమయంలో అదే జిల్లా అదనపు ఎస్పీగా ఉన్న జి.రాధిక పరిచయం అయ్యారు తరుణ్ జోషీకి. ఆమెకు పర్వతారోహణ హాబీ అట. అంతేకాదు ఆమె కూడా అనేక పర్వతాలు అధిరోహించారట. విధి నిర్వహణలో ఉన్న సమయంలోనే ఆమె నుండి పర్వతారోహణకు సంబంధించిన అనేక విషయాలను తెలుసుకునేవారట తరుణ్ జోషి. అయితే ఆ జిల్లాలో పనిచేస్తున్నంత కాలం పనుల ఒత్తిడిలో తన ఇష్టాన్ని నెరవేర్చుకోలేకపోయారట.

Dr Tarun Joshi IPS 2
2017 లో హిమాలయన్ మౌంటెనీరింగ్ ఇనిస్టిట్యూట్‌లో చేరిన తరుణ్ జోషి తొలిసారి హిమాలయాల్లోని మౌంట్ రీనాక్ ఎక్కారు. 2018 లో సదరన్ రష్యాలో ఉన్న భారీ అగ్ని పర్వతం మౌంట్ ఎల్బ్రస్ ఎక్కారు. 2019 లో అర్జెంటీనాలోని మౌంట్ ఎకన్వాపై అడుగు పెట్టారు. ఇదే సంవత్సరంలో ఇండోనేషియాలో ఉన్న మౌంట్ కార్‌స్టెంజ్స్ అధిరోహించారు. 2020 లో అంటార్కిటికాలోని ఎత్తైన మౌంట్ విన్సర్ ఎక్కారు. ఇది ఎక్కిన మూడు రోజుల్లో ఆస్ట్రేలియాలోని మౌండ్ కోస్యూస్కో అధిరోహించారు. 2021 లో టాంజానియాలోని కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించారు. అయితే ఇక ఫైనల్ టార్గెట్ ఎవరెస్టు ఎక్కడమే లక్ష్యంగా సాధన చేస్తున్నారట డాక్టర్ తరుణ్ జోషి. ఓవైపు పనుల ఒత్తిడి ఉన్నా తన ఇష్టాలను నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తున్న పోలీసు బాస్‌కి అభినందనలు చెబుదాం.