Bhatti Vikramarka Arrest : సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సహా పలువురు అరెస్టు

చలో రాజ్ భవన్ కి బయలుదేరిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను ఖైరతాబాద్ చౌరస్తా వద్ద పోలీసులు అరెస్టు చేశారు. ఖైరతాబాద్ నుంచి గోషామాల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Bhatti Vikramarka Arrest : చలో రాజ్ భవన్ కి బయలుదేరిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను ఖైరతాబాద్ చౌరస్తా వద్ద పోలీసులు అరెస్టు చేశారు. ఖైరతాబాద్ నుంచి గోషామాల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో ఏఐసీసీ సెక్రెటరీ నదీమ్ జావిద్ రోహిత్ చౌదరి, పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, ఖైరతాబాద్ డిసిసి అధ్యక్షుడు రోహిన్ రెడ్డి తదితరులు ఉన్నారు.

ఈ సందర్భంగా బట్టి విక్రమార్క మాట్లాడుతూ దేశంలోని ఆస్తులు ఒక్కరిద్దరికి కట్టబెడుతున్నారని ఆరోపించారు. దేశ సంపద దేశ ప్రజలకు చెందాలన్నారు. కాంగ్రెస్ ప్రజలకోసం పనిచేసింది కానీ, మోదీ వచ్చాక ఒక్కరిద్దరికే కట్టబెడుతున్నారని విమర్శించారు. ప్రజలకు చెందిన లక్షల కోట్ల సంపద అవినీతికి గురికాకుండా పోరాడాలని పిలుపునిచ్చారు.

Telangana Congress: రాజ్యాంగం ఎందుకు మార్చాలో కేసీఆర్ చెప్పాలి: భట్టి విక్రమార్క

దేశం ప్రమాదంలో పడిందన్నారు. రాహుల్ దేశం కోసం పాదయాత్ర చేశారని పేర్కొన్నారు. హిడెన్ బర్గ్ లో వచ్చిన కథనం ప్రపంచాన్ని షేక్ చేసిందన్నారు. ఈ దేశం నుండి మోదీని వదిలించుకోవాలన్నారు. అదానీపై మోదీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.

తమ పోరాటం ప్రజల కోసం, దేశం సంపద రక్షణ కోసమని స్పష్టం చేశారు. రాజ్ భవన్ కు వెళ్లి తమ నిరసన తెలపడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ప్రభుత్వం తమ నేతలను మధ్యలో అడ్డుకునే ప్రయత్నం చేస్తుందన్నారు. పోలీసులు అడ్డుకున్నా ఛలో రాజ్ భవన్ కు వెళతామని అన్నారు.

ట్రెండింగ్ వార్తలు