Telangana : మరో కొత్త పథకం ప్రకటించిన ప్రభుత్వం.. దసరా నుంచి ప్రారంభం

మరో వినూత్న పథకానికి కేసీఆర్ సర్కార్ శ్రీకారం చుట్టింది. విద్యార్థుల సంక్షేమం దిశగా మరో చారిత్రక నిర్ణయం తీసుకుంది. Telangana - CM Break Fast Scheme

CM Break Fast Scheme

Telangana – CM Break Fast Scheme : తెలంగాణ ప్రభుత్వం స్కూల్ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. మరో కొత్త పథకం అనౌన్స్ చేసింది. అదే సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ (ముఖ్యమంత్రి అల్పాహార పథకం). మధ్యాహ్న భోజనం తరహాలో 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఉదయం అల్పాహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి అల్పాహారం పథకం పేరుతో అల్పాహారం అందించనుంది. ఈ మేరకు ప్రభుత్వం జీవో విడుదల చేసింది.

దసరా రోజు అంటే అక్టోబర్ 24 నుంచి ఈ స్కీమ్ ని ప్రారంభించనున్నారు. స్కూల్ వర్కింగ్ డేస్ లో ఉదయం పూట విద్యార్థులకు అల్పాహారం అందించనున్నారు. ఈ పథకం వల్ల ప్రభుత్వ ఖజానాపై రూ.400 కోట్ల అదనపు భారం పడనుంది.

Also Read..KVP: కేవీపీపై రేవంత్‌రెడ్డికి కోపమెందుకు.. బీఆర్ఎస్‌కు వచ్చిన ఇబ్బందేంటి?

‘మరో వినూత్న పథకానికి కేసీఆర్ సర్కార్ శ్రీకారం చుట్టింది. విద్యార్థుల సంక్షేమం దిశగా మరో చారిత్రక నిర్ణయం తీసుకుంది. దసరా నుండి ముఖ్యమంత్రి అల్పాహార పథకం ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్ 24 నుంచి అన్ని ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థినీ విద్యార్థులకు ముఖ్యమంత్రి అల్పాహార పథకం కింద అల్పాహారం అందిస్తాం.

 

విద్యార్థులకు చక్కని బోధనతో పాటు మంచి పోషకాహారం అందించేందుకు సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ తీసుకొస్తున్నారు’ అని అధికారులు తెలిపారు. కాగా, తమిళనాడులో అమలవుతున్న ఈ పథకం విధానాన్ని అధ్యయనం చేసేందుకు త్వరలోనే ఐఎఎస్ ల బృందం వెళ్లనుంది.

Also Read..Hyderabad IT Employees: హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులకు షాకిచ్చిన పోలీసులు.. అనుమతి లేకుండా అలాచేస్తే కఠిన చర్యలు..