CM KCR : సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటన ఖరారు

సీఎం కేసీఆర్ డిసెంబర్ 19న వనపర్తి, 20న జనగామ జిల్లాలో పర్యటించనున్నారు. ఆ తర్వాత వరంగల్‌, నల్లగొండ జిల్లాల్లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు.

Kcr (1)

CM KCR districts tour finalized : సీఎం కేసీఆర్‌ జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నారు. సీఎం జిల్లాల పర్యటన ఖరారు అయింది. ఈ నెల 19న వనపర్తి, 20న జనగామ జిల్లాలో పర్యటించనున్నారు. ఆ తర్వాత వరంగల్‌, నల్లగొండ జిల్లాల్లో పర్యటిస్తారు. ఈ సందర్బంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయాన్ని ప్రారంభించడంతోపాటు సభల్లో కూడా పాల్గొని, ప్రసంగించనున్నారు.

తెలంగాణ భవన్‌లో ఈ నెల 17న టీఆర్‌ఎస్‌ విస్తృత స్థాయి సమావేశం జరుగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు జరిగే ఈ మీటింగ్‌కు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, జెడ్పీ చైర్‌పరన్స్‌, డీసీఎంఎస్ అధ్యక్షులు, కేడీసీసీబీ అధ్యక్షులు, రైతు బంధు జిల్లా కమిటీల అధ్యక్షులతోపాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హాజరుకానున్నారు.

Power Cut Off : ఉప్పల్‌ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియానికి కరెంట్‌ కట్‌

అలాగే డిసెంబర్ 18న జిల్లా కలెక్టర్లతో సీఎం సమావేశం కానున్నారు. దళిత బంధుతోపాటు పలు అంశాలపై చర్చించనున్నారు. ప్రగతి భవన్ లో జరిగే సమావేశానికి మంత్రులు, సీఎం సోమేశ్ కుమార్, సీనియర్ అధికారులు హాజరవ్వనున్నారు.