CM KCR : నేడు మేడారం జాతరకు వెళ్లనున్న సీఎం కేసీఆర్‌.. వనదేవతలకు ప్రత్యేక పూజలు

మేడారం జాతరలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. భక్తుల జయజయధ్వానాల మధ్య సమ్మక్క తల్లి గద్దెపై కొలువుదీరింది. నిన్న సాయంత్రం చిలుకలగుట్ట నుంచి భక్తుల కోలాహలం, భారీ బందోబస్తు మధ్య బయలుదే

Kcr (7)

Medaram jatara : సీఎం కేసీఆర్‌ నేడు మేడారం జాతరకు వెళ్లనున్నారు. సమ్మక్క-సారలమ్మ గద్దెల దగ్గర ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఉదయం 11గంటలకు హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో మేడారం బయల్దేరనున్నారు. మధ్యాహ్నం 12.30గంటలకు జాతర ప్రాంగణానికి చేరుకుంటారు. అక్కడ పూజల అనంతరం మధ్యాహ్నం 3గంటలకు తిరుగు ప్రయాణమవుతారు. ఇటు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ కూడా వనదేవతలను దర్శించుకుంటారు.

మేడారం జాతరలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. భక్తుల జయజయధ్వానాల మధ్య సమ్మక్క తల్లి గద్దెపై కొలువుదీరింది. నిన్న సాయంత్రం చిలుకలగుట్ట నుంచి భక్తుల కోలాహలం, భారీ బందోబస్తు మధ్య బయలుదేరింది. అదే సమయంలో చిలుకల గుట్ట దిగువన గౌరవ సూచకంగా పోలీసులు, గాల్లోకి కాల్పులు జరిపారు. రాత్రి 9గంటల 45నిమిషాలకు గద్దెపై ఆశీనురాలైంది. సమ్మక్క తల్లి గద్దెల వద్దకు చేరుకోవడంతో కాసేపు దర్శనాలు నిలిపివేశారు. గిరిజన పూజారులు సంప్రదాయ పూజలు చేసిన తరువాత దర్శనాలు కొనసాగించారు. అమ్మ గద్దెపైకి చేరే అద్భుతాన్ని కనులారా వీక్షించిన భక్తకోటి పరవశించిపోయింది.

Medaram Jatara 2022 : మేడారం జాతరలో 20 ఏళ్ల తర్వాత అద్భుత ఘట్టం

సమ్మక్క పూజారులను దైవాంశ సంభూతులుగా భావించి భక్తులు వారిని తాకేందుకు పోటీపడ్డారు. పెద్దమ్మ రాకతో గద్దెలు కొత్త కళను సంతరించుకొన్నాయి. దేవేరుల కుటుంబమంతా మేడారం ఆలయంలోని గద్దెలపై కొలువుదీరడంతో భక్తుల సంఖ్య మరింత పెరిగింది. జంపన్న వాగులో పుణ్యస్నానాలు చేసిన అనంతరం భక్తులు వనదేవతలను దర్శించుకుంటున్నారు. ఇవాళ, రేపు భక్తుల దర్శనార్థం వనదేవతలు గద్దెలపైనే ఉంటారు. రేపు సాయంత్రం దేవతల వన ప్రవేశంతో జాతర ముగుస్తుంది.