MLC seat
Hyd Local Bodies MLC Seat : హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సీటు ఎంఐఎంకు ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ సీటును దక్కించుకునేందుకు కావాల్సిన మెజారిటీ ఓట్లు బీఆర్ఎస్ కు ఉన్నప్పటికీ మిత్ర పక్షానికే అవకాశం ఇచ్చారు. ఇటీవల అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ ను ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కలిశారు.
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీటు తమకు కేటాయించాలని కోరారు. దీనిపై సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. ఎంఐఎం అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని సీఎం సూచించినట్లు సమాచారం. ఇదే స్థానం నుంచి ప్రస్తుతం ఎంఐఎం నేత అమీనుల్ హసన్ జాఫ్రీ ఎమ్మెల్సీగా ఉన్నారు.
YCP MLC Candidates : స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించనున్న వైసీపీ
మరోసారి జాఫ్రీకే ఎంఐఎం అవకాశం ఇవ్వనుంది. ఒకటి, రెండు రోజుల్లో జాఫ్రీ నామినేషన్వే యనున్నారు. మార్చి 13న పోలింగ్ జరుగనుంది. మార్చి 16 నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుంది. కొత్తగా ఎన్నికయ్యే ఎమ్మెల్సీ పదవి కాలం మే 2వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది.