CM KCR
CM KCR: మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంది. సోమవారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో పలు నిర్ణయాలకు ఆమోదముద్ర పడింది. టీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు, మెట్రో విస్తరణ, ఎయిర్ పోర్టు అభివృద్ధి ఇలా అనేక కీలక విషయాలపై తెలంగాణ మంత్రి మండలి ఆమోద ముద్ర వేసింది. ముఖ్యంగా గత వారంరోజులు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ, నిర్మల్, అదిలాబాద్, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. సుమారు 10 జిల్లాల్లో వర్షాలతో జరిగిన నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించింది. వరద ప్రభావిత ప్రాంతాలకు తక్షణ సాయం కింద రూ. 500 కోట్లు మంజూరు చేయాలని ఆర్థికశాఖను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
Telangana Cabinet : హైదరాబాద్‌లో మెట్రో విస్తరణకు కేబినెట్ ఆమోదం.. కొత్త మార్గాలు ఇవే ..
వరదల సమయంలో ఆపద్భాందవులగా నిలిచిన ఉద్యోగులను సన్మానించేందుకు మంత్రి మండలిలో సీఎం కేసీఆర్ ప్రస్తావించారు. విద్యుత్ శాఖకు చెందిన హెల్పర్, లైన్‌మెన్‌తో పాటు, ఆశ్రమ పాఠశాలలో 40 మంది పిల్లలను కాపాడిన మీనయ్య సేవలను సీఎం కేసీఆర్ స్వయంగా అభినందించారు. ఆగస్టు 15న ఆ ముగ్గురికి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున సత్కరిస్తామని కేసీఆర్ ప్రకటించారు.
KTR: ప్రభుత్వంలో టీఎస్‌ఆర్టీసీ విలీనం… తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం
మరోవైపు రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల నష్టాలపై మంత్రి మండలి విస్తృతంగా చర్చించింది. పలు జిల్లాల్లో ప్రజలకు, వివిధ వర్గాలకు నష్టం జరిగిందని, పంటలు, రోడ్లు, చెరువులు, కాలువలు ధ్వంసం అయ్యాయని అధికారులు నివేదించారు. దీనిపై కేసీఆర్ స్పందించి తక్షణ సహాయం కింద రూ.500 కోట్లు నిధులు విడుదల చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించారు. అంతేకాక మరణించిన 40 మంది వివరాలను సేకరించి వారి కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని అధికారులకు సూచించారు. మరోవైపు ఖమ్మం పట్టణం మున్నేరు వరదల నుంచి రక్షించేందుకు ఖమ్మం పొడవునా ఉన్న నదివెంట ఆర్‌సీసీ గోడతో కూడిన కరకట్టను నిర్మించాలని, దీనికి రూ. 150 కోట్లు మంజూరు చేస్తున్నట్లు, దీనికి సంబంధించి నివేదిక తయారు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.