Telangana Vimochana Dinotsavam 2022 : తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. సెప్టెంబర్ 17 అంశం రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చిచ్చు రాజుకుంది. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెంచింది. అటు సీఎం కేసీఆర్ కూడా తగ్గేదేలే అంటున్నారు. బీజేపీకి చెక్ పెట్టేలా ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నారు.
సెప్టెంబర్ 17న తెలంగాణ జాతీయ సమైక్యతా దినం..
రాచరిక వ్యవస్థ నుండి ప్రజాస్వామిక వ్యవస్థలోకి జరిగిన తెలంగాణ సమాజ పరిణామక్రమం, 2022 సెప్టెంబర్ 17 నాటికి 75 సంవత్సరాల్లోకి అడుగిడుతున్నది. (1/2)
(File Photo) pic.twitter.com/Ae61biOvoo
— TRS Party (@trspartyonline) September 3, 2022
మూడు గంటల పాటు జరిగిన సమావేశంలో తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యతా దినంగా నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. 16,17,18 తేదీల్లో మూడు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా వజ్రోత్సవాలు నిర్వహించాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. ప్రారంభోత్సవ వేడుకలను అట్టహాసంగా నిర్వహించాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించింది.
కాగా.. సెప్టెంబర్ 17 సెంటిమెంట్ ను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వస్తున్న బీజేపీ ఇప్పుడు మరో ఎత్తుగడ వేసింది. హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఏడాది పాటు ఉత్సవాలు నిర్వహించనున్నట్టు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.
సెప్టెంబర్ 17న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ప్రారంభ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఇందులో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమానికి రావాలంటూ తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్ర ముఖ్యమంత్రులకు కిషన్ రెడ్డి లేఖ రాశారు.
ఈ నేపథ్యంలో 2022 సెప్టెంబర్ 17 ను ‘తెలంగాణ జాతీయ సమైక్యతా దినం’ గా పాటిస్తూ.. సెప్టెంబర్ 16, 17, 18 తేదీలలో మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా.. ‘తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల’ ప్రారంభ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేబినెట్ సమావేశం నిర్ణయించింది. (2/2)
— TRS Party (@trspartyonline) September 3, 2022