KCR on Bandi Sanjay: బండి సంజయ్ క్షమాపణ చెప్పాల్సిందే..!

యాసంగిలో వరి పండించాలంటూ చేసిన వ్యాఖ్యలపై.. బండి సంజయ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.. ముఖ్యమంత్రి కేసీఆర్.

Kcr On Sanjay

KCR on Bandi Sanjay: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై.. ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. యాసంగిలో వరి పండించాలంటూ రైతులకు చెప్పిన మాట నిజమా కాదా చెప్పాలన్నారు. ఈ మాటపై.. బండి సంజయ్ నిలబడతారా లేదా.. తేల్చి చెప్పాలని డిమాండ్ చేశారు. తాము హిందీలోనో, ఇంగ్లిష్ లోనో అడగడం లేదని.. తన వ్యాఖ్యలపై బండి సంజయ్ నిలబడతారో లేదో మాత్రమే చెప్పాల్సిందిగా అడుగుతున్నామని కేసీఆర్ అన్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాలకు బండి సంజయ్ వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని కేసీఆర్ ప్రశ్నించారు. యాసంగిలో వరి పండించాలంటూ గందరగోళం సృష్టించారు కాబట్టే.. రైతులు బండి సంజయ్ ను ప్రశ్నించారని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గర.. టీఆర్ఎస్ కార్యకర్తలు ఉంటారని.. అందులో తప్పేంటని అన్నారు. తమ పార్టీకి 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారని.. అందులో లక్షలాది మంది రైతులు ఉంటారని.. ఆ క్రమంలోనే ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గర టీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

యాసంగిలో వరి పండించాలన్న సంజయ్ కామెంట్లపై తాను కేంద్ర మంత్రికి స్వయంగా ఫోన్ చేసి మరీ మాట్లాడినట్టు కేసీఆర్ తెలిపారు. ఈ విషయంలో మరోసారి కేంద్రాన్ని స్పష్టత కోరుతున్నామని చెప్పారు.. కేసీఆర్.

Read More:

CM KCR: ధాన్యం కొనుగోలులో కేంద్రం వైఖరికి నిరసనగా.. ఈనెల 18న హైదరాబాద్‌లో TRS ధర్నా