TELANGANA NEW REVENUE ACT : రెవెన్యూ శాఖ ప్రక్షాళణపై ఫోకస్ పెట్టిన సీఎం కేసీఆర్… గ్రామాల్లో ఆస్తిమార్పిడి విధానంపై అడిగి తెలుసుకున్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్ గ్రామ పంచాయతీ కార్యదర్శి రమాదేవికి ఫోన్ చేసి ఆశ్చర్యపర్చిన ముఖ్యమంత్రి… గ్రామంలో ఇంటి పన్నుల నిర్వహణ, ఇళ్లకు అనుమతుల జారీ, ఇంటి యజమాని పేరు మార్పిడి, వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చడం తదితర అంశాల గురించి ఆరా తీశారు.
ఈ ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్ అయిందా లేదా అనే విషయాలపైనా సీఎం ఆరా తీశారు. గ్రామస్థాయిలో ఇండ్ల నిర్మాణం, వాటి అనుమతులు, పన్ను వసూలు మొదలైనవి ఎలా జరుగుతున్నాయని ఆరా తీశారు. ఇంటి నిర్మాణానికి గ్రామ పంచాయతీ అనుమతి తీసుకోవడం, పన్ను కట్టడం తప్పనిసరి అని.. తాను కూడా పన్ను చెల్లించిన తర్వాతే ఇల్లు కట్టానని సీఎం చెప్పారు.
గ్రామం యొక్క జూరిస్‌డిక్షన్‌లో ఎవరు ఎక్కడ ఇల్లు కట్టినా పర్మిషన్ కచ్చితంగా తీసుకోవాలెనని, ట్యాక్స్ కూడా పే చేయాలేనన్నారు. తాను ఇప్పుడు ట్యాక్స్ కూడా రెగ్యులర్‌గా పే చేయాలని, ఇదీ చట్టం అని వివరించారు. ఎమ్మార్వో ఆఫీసు, పంచాయతీ ఆఫీసుల్లో ఉండే రికార్డులను అడిగి తెలుసుకున్నారని, మీడియాకు రమాదేవి తెలిపారు.
ఏనుగల్ గ్రామంలో ఇంటి పన్నుల నిర్వహణ, అనుమతుల జారీ, ఇళ్ల యజమానుల పేరు మార్పిడి, వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్పు తదితర అంశాల గురించిఅడిగి తెలుసుకున్నట్లు వెల్లడించారు.