CM KCR
Ujjain Mahankali – CM KCR: సికింద్రాబాద్ (Secunderabad) ఉజ్జయినీ మహంకాళీ అమ్మవారి బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. తెలంగాణ (Telangana) సీఎం కేసీఆర్ దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు. వారికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కేసీఆర్, ఆయన సతీమణి శోభతో కలిసి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
వారితో పాటు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి కూడా ఉన్నారు. అనంతరం ఎమ్మెల్సీ కవిత కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. మహంకాళీ అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. ఇవాళ తెల్లవారు జాముు నుంచి అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. ” లష్కర్ బోనాల పర్వదినాన్ని పురస్కరించుకుని నేడు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి కుటుంబ సమేతంగా బోనాలు సమర్పించాను. ప్రతి ఒక్కరి శ్రేయస్సును కాంక్షిస్తూ, అందరూ ఆరోగ్యంగా ఉండాలని, రాష్ట్రం, దేశం మరింత అభివృద్ధిని సాధించాలని అమ్మవారిని ప్రార్థించాను” అని ఆయన ట్వీట్ చేశారు.