Kcr Press Meet
CM KCR Press Meet : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 2021, నవంబర్ 20వ తేదీ శనివారం ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. దీంతో ఆయన ఎం మాట్లాడుతారనే ఉత్కంఠ నెలకొంది. ఇటీవలే నిర్వహించిన ప్రెస్ మీట్ లో కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పార్టీపై విమర్శలు గుప్పించిన సంగతి తెలిసేందే. ధాన్యం కొనుగోళ్ల అంశంపై బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఘాటు కౌంటర్ ఇచ్చారు. అంతేగాకుండా..టీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన మహాధర్నాలో స్వయంగా సీఎం కేసీఆర్ పాల్గొని కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు.
Read More : Lakshmi Parvati : ఎన్టీఆర్ గుండెపోటుకు చంద్రబాబే కారణం : లక్ష్మీపార్వతి
వరి పంట కొంటారా ? కొనరా ? అనే విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై కూడా ఆయన మాట్లాడారు. రైతులను కేంద్రం పట్టించుకోవడం లేదని, వారు ఆందోళన చేస్తున్నా…చట్టాలను రద్దు చేయడం లేదని మండిపడ్డారు. ఈ క్రమంలో…2021, నవంబర్ 19వ తేదీ శుక్రవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ..జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. చట్టాలను ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. మొత్తానికి రైతులు చేస్తున్న పోరాటాలకు కేంద్రం తలొగ్గిందని విపక్షాలు వెల్లడించాయి.
Read More : వ్యాక్సిన్ వేసుకుంటే ఫ్రిడ్జ్, వాషింగ్ మెషీన్, టీవీలు _LED TVs, Refrigerators For Getting Vaccinated
ఈ క్రమంలో కేసీఆర్ నిర్వహించే ప్రెస్ మీట్ లో ఈ అంశాలపై స్పందించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అంతేగాకుండా..ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం, ఎఫ్ సీఐ స్పందనలపై ఆయన రియాక్ట్ అవుతారని సమాచారం. మరోవైపు..మంత్రులు, టీఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్యనేతలతో ఆయన భేటీ అయ్యారు. ప్రగతి భవన్ రావాల్సిందిగా వారికి సమాచారం అందించారు. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు, అభ్యర్థుల ఎంపిక విషయంలో వారితో చర్చిస్తున్నట్లు సమాచారం.