CM KCR : తెలంగాణను ఆంధ్రలో కలిపిందే కాంగ్రెస్ : సీఎం కేసీఆర్

చంద్రబాబుకు చెంచాగిరి చేసిన వాళ్లు ఇప్పుడు కేసీఆర్ ను తిడుతున్నారని పేర్కొన్నారు. పెన్షన్ ను రూ.5 వేలకు పెంచుతామని చెప్పారు.

CM KCR (4)

CM KCR Public Meeting : తెలంగాణను ఆంధ్రలో కలిపిందే కాంగ్రెస్ అని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణలో కృష్ణా, గోదావరి జీవ నదులు ఉన్నా తాగడానికి నీళ్లు లేని పరిస్థితులు ఉండేవన్నారు. జనగాం జిల్లా చేర్యాలలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. చంద్రబాబుకు చెంచాగిరి చేసిన వాళ్లు ఇప్పుడు కేసీఆర్ ను తిడుతున్నారని పేర్కొన్నారు.

పెన్షన్ ను రూ.5 వేలకు పెంచుతామని చెప్పారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పెన్షన్ రూ.2 వేల ఇస్తున్నారని పేర్కొన్నారు. రైతుబంధు ఆలోచనే బీఆర్ఎస్ ది అని అన్నారు. రైతు బీమా ఇస్తున్నాం, ధాన్యం కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. గతంలో తెలంగాణ అంటే కరవు ప్రాంతం అనే ముద్ర వేశారని పేర్కొన్నారు.

Harish Rao : కేసీఆర్ గెలిస్తే అందరం బాగుపడతాం లేదంటే బాధ పడతాం : మంత్రి హరీష్ రావు

తెలంగాణలో 3 కోట్ల టన్నుల ధాన్యం పండుతోందన్నారు. ఎక్కడా చూసినా ధాన్యం రాసులు కనిపిస్తున్నాయని తెలిపారు. రైతుబంధును రూ.16 వేలకు పెంచుతామని చెప్పారు. కాంగ్రెస్ నేతలు రైతుబంధు దుబారా అంటారు.. కరెంట్ 3 గంటలు చాలని మాట్లాడుతారు అని పేర్కొన్నారు.

కర్ణాటకలో 5 గంటల కరెంట్ కూడా సరిగా లేదని విమర్శించారు. అభ్యర్థుల గుణ గణాలు, పార్టీల చరిత్ర చూడాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల చేతిలో ఉండే ఆయుధం ఓటు అని అన్నారు. ఓటు ప్రజల తలరాతను మారుస్తుందన్నారు. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసమని చెప్పారు.

Etela slams HarishRao: హరీశ్‭రావు మీద షాకింగ్ కామెంట్స్ చేసిన ఈటల రాజేందర్

బీఆర్ఎస్ గెలిస్తే 24 గంటల కరెంట్ ఉంటుంది.. కాంగ్రెస్ గెలిస్తే 3 గంటలే కరెంట్ ఉంటుందన్నారు. తెలంగాణలో నీటిపై పన్ను లేదు, 24 గంటల కరెంట్ ఇస్తున్నామని చెప్పారు. 50 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసిందో పదేళ్లలో బీఆర్ఎస్ ఏం చేసిందో చర్చకు పెట్టాలన్నారు.

ట్రెండింగ్ వార్తలు