Cm Kcr
Financial assistance for young woman : అరుదైన వ్యాధితో బాధపడుతున్న యువతి చికిత్సకు తెలంగాణ సీఎం కేసీఆర్ రూ.25 లక్షల మంజూరు చేశారు. ఈ విషయాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. వనపర్తి జిల్లా రేవల్లికి చెందిన శివాని పారక్సిస్మల్ నాక్టర్నల్ హిమోగ్లోబినురియా అనే వ్యాధితో గత కొంతకాలంగా బాధపడుతోంది. ఆమె చికిత్సకు రూ.30 లక్షలు ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పారు.
దీంతో సదరు యువతి తండ్రి బాల్ రెడ్డి మంత్రిని ఆశ్రయించారు. శివాని ఫ్యామిలీ 20 ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం హైదరాబాద్ లోని పీర్జాదీగూడలో స్థిరపడింది. బాల్ రెడ్డి క్యాబ్ డ్రైవర్ గా పని చేస్తున్నారు. ఆయనకు మంత్రి నిరంజన్ రెడ్డి రూ.25 లక్షల చెక్కును అందించారు.