CM KCR: అప్పుడు చాలా విధ్వంసం జరిగింది.. ఇప్పుడు “మరుగుజ్జు” మాటలు పట్టించుకోవద్దు: కేసీఆర్

CM KCR: తెలంగాణ కొత్త సచివాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్ ఈ సందర్భంగా మాట్లాడారు.

CM KCR

CM KCR: సమైక్య పాలనతో చాలా విధ్వంసం జరిగిందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణ ఒకప్పుడు వెనుకబడిన ప్రాంతమని చెప్పారు. అంబేద్కర్ బాటలో తెలంగాణ పాలన కొనసాగుతోందని చెప్పారు. తెలంగాణ కొత్త సచివాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్ ఈ సందర్భంగా మాట్లాడారు.

“నాడు బీళ్లు.. నేడు నిండుగా నీళ్లు. అపర భగరథుడే దిగివచ్చినట్లుంది. తెలంగాణ పునర్నిర్మాణానికి మిషన్ భగీరథ ప్రతీక. మిషన్ భగీరథతో ఫ్లోరైడ్ ను తరిమికొట్టాం. కోల్పోయిన అడవులు తిరిగి తెచ్చుకోవడం పునర్నిర్మాణమే. వలసలు వెళ్లిన పాలమూరు యువత తిరిగి వస్తున్నారు.

ఇది కూడా తెలంగాణ పునర్నిర్మాణమే. ఇప్పుడు తెలంగాణ సాధించిన ప్రగతి అద్భుతం. తెలంగాణ పరిపాలనకు గుండెకాయ సెక్రటేరియట్. సెక్రటేరియట్ ను ప్రారంభించడం నా అదృష్టంగా భావిస్తున్నా. కొంతమంది మరుగుజ్జు మాటలు పట్టించుకోనవసరం లేదు” అని కేసీఆర్ అన్నారు.

తెలంగాణ పునర్నిర్మాణానికి మిషన్ భగీరథ ప్రతీక అని సీఎం కేసీఆర్ అన్నారు. ఆచరణకు యోగ్యమైన విధానాలతో 33 జిల్లాలను ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. సమ్మిళిత అభివృద్ధితో ముందుకు వెళ్తున్నామని అన్నారు. మన గ్రామాలు ఎన్నో అవార్డులు సాధించాయని తెలిపారు.

TS New Secretariat: నూతన సచివాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్.. Live Updates