Delhi Kcr
CM KCR To Visit Delhi Soon : సీఎం కేసిఆర్ త్వరలో ఢిల్లీ పర్యటనకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల కేంద్రంలో మంత్రి వర్గ విస్తరణ కూడా పూర్తి కావడంతో కొత్త మంత్రులను కేసీఆర్ మర్యాద పూర్వకంగా కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల జల వివాదం కూడా ఈ పర్యటనలో ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రా ల మధ్య కృష్ణా జలాల విషయంలో వివాదం చెలరేగుతున్న సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం వరుసగా కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాస్తూనే ఉంది.
Read More : Petrol, Diesel Prices : పెట్రోల్ ధరలు..తగ్గేదే లే
తెలంగాణ సర్కార్ అనుసరిస్తున్న వైఖరిని తప్పుబడుతోంది. ఈ పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ కూడా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం కేంద్రం తలుపు తట్టే అవకాశం కనిపిస్తోంది. దీని కోసం త్వరలోనే హస్తినలో పర్యటించనున్నట్టు సమాచారం. రెండోసారి అధికారంలో వచ్చాక తొలిసారి మంత్రివర్గాన్ని పునర్వవ్యవస్థీకరించారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. కొత్తగా కేంద్ర మంత్రులు పెద్ద ఎత్తున మోడీ టీమ్‌లో చేరారు. పార్లమెంట్ సమావేశాలు జరిగే సమయంలో సాధారణంగా హస్తిన పర్యటనకు సీఎం కేసీఆర్ వెళ్లడం గత కొన్నేళ్లుగా అనవాయితీగా వస్తోంది. సాగునీటి జలాల వివాదం కూడా తలెత్తడంతో రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని తెలియచేసి సమస్య పరిష్కారం చేసేందుకు చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ కేంద్రాన్ని కోరే అవకాశం కనిపిస్తోంది.