KCR Delhi Tour : కేసీఆర్ ఢిల్లీ టూర్-రెండు రోజులు హస్తినలోనే..

తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు ఈరోజు సాయంత్రం ఢిల్లీ బయలుదేరి వెళ్ళారు. రేపు ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాద పూర్వకంగా కలిసి అభినందినలు తెలుపనున్నారు.

KCR Delhi Tour :  తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు ఈరోజు సాయంత్రం ఢిల్లీ బయలుదేరి వెళ్ళారు. రేపు ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాద పూర్వకంగా కలిసి అభినందినలు తెలుపనున్నారు. అనంతరం పలువురు కేంద్ర మంతులను కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

పోడు భూముల చట్ట సవరణకు కేంద్రంపై ఒత్తిడి తేవాలనే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దీంతో సీఎం కేసీఆర్ మరోసారి ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి పోడు భూములు, గిరిజన, ముస్లీం రిజర్వేషన్లు, ఇతర అంశాలను తీసుకెళ్లనున్నారు. పోడు భూముల కోసం ఇప్పటికే దరఖాస్తులను ఆహ్వానించిన తెలంగాణ సర్కార్….ఆ వివరాలను సమగ్రంగా పొందుపరిచి నివేదిక సిధ్దం చేసింది.

రెండు రోజుల పాటు హస్తినలోనే ఉండే సీఎం కేసీఆర్ ఉప రాష్ట్రపతి ఎన్నికలు, తాజా రాజకీయ పరిస్థితులపై వివిధ పార్టీల నేతలతో భేటీ అవుతారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్ వెంట సీఎస్ సోమేష్ కుమార్, ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్, జి.రంజిత్ రెడ్డి, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి రావుల శ్రవణ్ కుమార్ రెడ్డి, కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్, తదితరులు ఉన్నారు.

ట్రెండింగ్ వార్తలు