CM KCR : కరీంనగర్‌‌కు సీఎం కేసీఆర్, దళిత బంధు అమలుపై సమీక్ష

తెలంగాణ సర్కార్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకంపై.. సీఎం కేసీఆర్‌ ఫుల్‌ ఫోకస్ పెట్టారు.

Kcr

Dalith Bandhu : తెలంగాణ సర్కార్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకంపై.. సీఎం కేసీఆర్‌ ఫుల్‌ ఫోకస్ పెట్టారు. కరీంనగర్‌ జిల్లా పర్యటనలో భాగంగా..2021, ఆగస్టు 27వ తేదీ శుక్రవారం కలెక్టరేట్‌లో దళితబంధు పథకం అమలుపై సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. నిన్న సాయంత్రం హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో వరంగల్‌కు వెళ్లారు ముఖ్యమంత్రి. శుక్రవారం మధ్యాహ్నం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో దళిత బంధు అమలుపై సమీక్ష నిర్వహించనున్నారు. దళిత బంధు లబ్దిదారుల ఎంపిక నుంచి వారు ఏఏ పనుల కోసం ఆ నిధులను వినియోగిస్తారన్న విషయాలపై క్షుణ్ణంగా తెలుసుకోనున్నారు. దళిత బంధు డబ్బుతో ఆయా కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు అండగా ఉండాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం కేసీఆర్. మధ్యాహ్నం 3 గంటలకు హెలీకాప్టర్‌ ద్వారా హైదరాబాద్‌కు రానున్నారు.

Read More :Gold Rate: రెండో రోజు తగ్గిన బంగారం రేటు.. ఎంతంటే? 

వరంగల్ కు వెళ్లిన సీఎం కేసీఆర్..అక్కడ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ కుమారుడి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. రోడ్డుమార్గంలో కరీంనగర్ తీగలగుట్టపల్లిలోనే బస చేశారు. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు టీఆర్ఎస్ నేత రూప్ సింగ్ కూతురు వివాహానికి హాజరు కానున్నారు.

Read More : Neeraj Chopra: బ్రేక్ కావాలి.. ఈ సంవత్సరం ఇక ఆడేది లేదు – నీరజ్ చోప్రా

మరోవైపు…తెలంగాణ ప్రభుత్వం దళితబంధు పథకం కోసం మరో రూ.300 కోట్లు విడుదల చేసింది. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో దళితబంధు పథకం పైలట్‌ ప్రాజెక్టుగా అమలవుతోంది. హుజూరాబాద్‌లో ఖర్చు చేయడానికి వీలుగా కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ ఖాతాకు రూ.300 కోట్లను బదిలీ చేసింది. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం మూడు విడతలుగా రూ.1,200 కోట్లు విడుదల చేసింది. తెలంగాణ ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. దళితుల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంతో పైలట్‌ ప్రాజెక్టుగా స్టార్ట్ అయ్యింది. దళిత బంధు పేరుతో సూచనాత్మక ఆర్థికాభివృద్ధి పథకాల జాబితాను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఆర్థికంగా వెనుకబడిన దళితులను యజమానులను చేయడమే లక్ష్యంగా మహిళల పేరు మీద నగదును జమ చేసేందుకు ప్లాన్ చేస్తుంది.