Gold Rate: రెండో రోజు తగ్గిన బంగారం రేటు.. ఎంతంటే?
కొద్దిరోజులుగా పైపైకి ఎగబాకిన బంగారం ధరలు గత రెండు రోజులుగా దిగివస్తున్నాయి. పసిడి ప్రియులకి ఇది శుభవార్త.. బంగారం ధర రెండో రోజు కూడా తగ్గింది. నగల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం

Gold (1)
Gold Rate: కొద్దిరోజులుగా పైపైకి ఎగబాకిన బంగారం ధరలు గత రెండు రోజులుగా దిగివస్తున్నాయి. పసిడి ప్రియులకి ఇది శుభవార్త.. బంగారం ధర రెండో రోజు కూడా తగ్గింది. నగల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాద్ మార్కెట్లో రూ.44,200గా ఉంది. గురువారం రూ.150 తగ్గింది. అదే ఒక్క గ్రాము పసిడి రేటు రూ4,420కి లభిస్తుండగా బంగారం కొనాలి అనుకునేవారికి ఇది మంచి సమయమని బిలియన్ నిపుణులు చెబుతున్నారు.
పెట్టుబడులకు వాడే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాద్లో రూ.48,220 పలుకుతోంది. గురువారం రూ.160 తగ్గింది. ఒక్క గ్రాము స్వచ్ఛమైన బంగారం రేటు రూ.4,822కి దొరుకుతోంది. దేశవ్యాప్తంగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో రూ.44,560, ముంబైలో రూ.46,220, న్యూఢిల్లీలో రూ.46,350, కోల్కతాలో రూ.46,600గా ఉండగా హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం, బెంగళూరులో రూ.44,200కి లభిస్తోంది.
రాఖీ పౌర్ణమి వేళ తగ్గుదల మొదలైన బంగారం ధరలు వరసగా తగ్గడం అతివలకు ఊరట కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు.. బంగారంపై పెట్టుబడి పెట్టేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ సంక్షోభంతోపాటు.. తాలిబన్ల సమస్య కూడా ఉండటంతో చాలామంది బంగారంపై పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గుచూపుతున్నారు.