×
Ad

CM KCR : సీఎం కేసీఆర్ సూర్యాపేట పర్యటన.. కొత్త కలెక్టరేట్ తోపాటు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం

మధ్యాహ్నం 12:45 గంటలకు జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 12.55 గంటలకు టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు.

  • Published On : August 19, 2023 / 09:24 PM IST

CM KCR Suryapeta Tour

CM KCR Suryapeta Tour : సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆదివారం సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. నూతన కలెక్టరేట్, జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్, ప్రభుత్వ మెడికల్ కళాశాల, సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్ సముదాయాలు, బీఆర్ఎస్ పార్టీ జిల్లా నూతన కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ ఉదయం 10:35గంటలకు రోడ్డు మార్గాన ప్రగతి భవన్ నుండి బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు.

ఉదయం 10:40 బేగంపేట ఎయిర్ పోర్టు నుండి సూర్యాపేట ఎస్ వి డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ కు సీఎం కేసీఆర్ హెలికాప్టర్ లో చేరుకోనున్నారు. ఉదయం 11:25గంటలకు హెలిపాడ్ నుండి రోడ్డు మార్గాన ప్రభుత్వ మెడికల్ కళాశాలకు పయనమవుతారు. మెడికల్ కళాశాల నూతన భవనాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించి పరిశీలించనున్నారు. మధ్యాహ్నం 12.20 గంటలకు సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్ ను ప్రారంభించనున్నారు.

Jagga Reddy: బీఆర్ఎస్‌లో చేరుతున్నారన్న ప్రచారంపై జగ్గారెడ్డి ఏమన్నారంటే?

మధ్యాహ్నం 12:45 గంటలకు జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 12.55 గంటలకు టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 1.25 గంటలకు నూతన జిల్లా కలెక్టరేట్ సముదాయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. అనంతరం మంత్రి క్యాంప్ కార్యాలయంలో మంత్రి జగదీష్ రెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో కలిసి భోజన విరామం తీసుకోనున్నారు.

మధ్యాహ్నం 3.30 గంటలకు వ్యవసాయ మార్కెట్ కమిటీ సమీపంలో ఏర్పాటు చేసే బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకుంటారు. సాయంత్రం 4.50 గంటలకు సీఎం కేసీఆర్ హెలికాప్టర్ లో హైదరాబాద్ బయల్దేరనున్నారు. వాతావరణం అనుకూలించకపోతే రోడ్డు మార్గాన హైదరాబాద్ బయల్దేరి వెళ్లనున్నారు.