×
Ad

తప్పుడు రాతలతో మా ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర: ధ్వజమెత్తిన రేవంత్‌ రెడ్డి  

"కుట్రలు, కుతంత్రాలతో ప్రభుత్వాన్ని పడగొట్టాలని అనుకుంటున్నారు. సింగరేణి టెండర్ల విషయంలో ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు. 2034 వరకు కాంగ్రెస్‌ అధికారంలో ఉంటుంది" అని తెలిపారు.

CM Revanth Reddy

  • మా ప్రభుత్వాన్ని బద్నాం చేయొద్దు
  • ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో పన్నాగాలు
  • మంత్రులపై వార్తలు రాసే ముందు నా వివరణ తీసుకోండి  

Revanth Reddy: తప్పుడు రాతలతో ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్తున్నారంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. ఖమ్మం జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు.

“మా ప్రభుత్వాన్ని బద్నాం చేయొద్దు. ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో ఉండి కొందరు పన్నాగాలు పన్నుతున్నారు. నా మంత్రులపై వార్తలు రాసే ముందు నా వివరణ తీసుకోండి. సింగరేణి టెండర్‌ విషయంలో అవినీతికి ఆస్కారం లేదు.

Also Read: భారత్ 114 రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం.. పాక్‌కు ముచ్చెమటలు.. చైనాతో కలిసి ఇలా..

అనుభవం ఉన్నవారికే టెండర్‌ ఇస్తాం. సింగరేణిలో బొగ్గు స్కామ్‌ అంటూ వార్తలు రాస్తున్నారు. రెండేళ్ల మా పాలనలో అవినీతికి తావు ఇవ్వలేదు.

కుట్రలు, కుతంత్రాలతో ప్రభుత్వాన్ని పడగొట్టాలని అనుకుంటున్నారు. సింగరేణి టెండర్ల విషయంలో ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు. 2034 వరకు కాంగ్రెస్‌ అధికారంలో ఉంటుంది” అని తెలిపారు. వచ్చే మున్సిపల్‌ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ను గెలిపించాలని రేవంత్‌ రెడ్డి కోరారు.

ప్రత్యక్షంగా, పరోక్షంగా కుంభకోణం జరిగిందని వార్తలు రాస్తున్నారని చెప్పారు. సింగరేణి బొగ్గు మాయమైందని అంటున్నారని తెలిపారు. తమ పాలనలో ఎలాంటి అవకతవకలకు అవకాశం ఇవ్వలేదని చెప్పారు. మీడియా వారి మధ్య ఏమైనా గొడవలు ఉంటే వారు తలుపులు మూసుకొని కొట్టుకోవాలని, అంతేగానీ, తమ మంత్రులను బద్నాం చేయొద్దని అన్నారు.

కాగా, బొగ్గు స్కామ్‌ అంటూ వస్తున్న వార్తలపై తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా మండిపడ్డారు. అవి తప్పుడు కథనాలని అన్నారు. “మీకు, ఇతర మీడియా సంస్థల మధ్య ఏముందో నాకు తెలియదు. మీ మధ్యలో ప్రజాప్రతినిధులను లాగొద్దు” అని అన్నారు.