బాహుబలి కాలకేయుడిది మా ఊరే- సీఎం రేవంత్ రెడ్డి

ఓసారి ఆయనను కొడంగల్ కు తీసుకుని రావాలని ఆ మహిళతో చెప్పారు సీఎం రేవంత్.

CM Revanth Reddy : కోస్గిలో స్వయం సహాయక మహిళా సంఘాలతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. దీనికి పెద్ద సంఖ్యలో మహిళలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఓ మహిళతో సరదాగా మాట్లాడారు.

బాహుబలి సినిమా ప్రస్తావన తెచ్చారు రేవంత్ రెడ్డి. ఆ సినిమాలో కాలకేయుడి పాత్ర గురించి చెప్పిన సీఎం రేవంత్.. కాలకేయుడిది మా ఊరే అని తెలిపారు. సీఎం రేవంత్ తో మాట్లాడిన ఓ మహిళ.. బాహుబలి‎లో కాలకేయ పాత్ర పోషించిన నటుడు ఎవరో కాదు.. నాకు మరిది అవుతాడు అని సీఎం రేవంత్ తో చెప్పింది. ఓసారి ఆయనను కొడంగల్ కు తీసుకుని రావాలని ఆ మహిళతో చెప్పారు సీఎం రేవంత్. కాలకేయుడి పాత్ర పోషించిన నటుడిది మా కొడంగల్ అని తన పక్కనే ఉన్న కాంగ్రెస్ నాయకులతో చెప్పారు సీఎం రేవంత్. ఈ సందర్భంగా అక్కడ కాసేపు నవ్వులు పూయించారు సీఎం రేవంత్.

Also Read: చిన్నారులు రాసిన లేఖపై స్పందించిన హైకోర్టు.. చీఫ్ సెక్రటరీ, ఇతర అధికారులకు కీలక ఆదేశాలు

ట్రెండింగ్ వార్తలు