చిన్నారులు రాసిన లేఖపై స్పందించిన హైకోర్టు.. చీఫ్ సెక్రటరీ, ఇతర అధికారులకు కీలక ఆదేశాలు

మా పార్క్ స్థలాన్ని కబ్జా చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని చిన్నారులు రాసిన లేఖకు తెలంగాణ హైకోర్టు స్పందించింది.

చిన్నారులు రాసిన లేఖపై స్పందించిన హైకోర్టు.. చీఫ్ సెక్రటరీ, ఇతర అధికారులకు కీలక ఆదేశాలు

Telangana High Court

Updated On : February 21, 2024 / 12:36 PM IST

Telangana High Court : మా పార్క్ స్థలాన్ని కబ్జా చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని చిన్నారులు రాసిన లేఖకు తెలంగాణ హైకోర్టు స్పందించింది. వెంటనే పూర్తి వివరాలు ఇవ్వాలని తెలంగాణ చీఫ్ సెక్రటరీ, కలెక్టర్, పురపాలక సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను హైకోర్టు మార్చి 7వ తేదీకి వాయిదా వేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Also Read : విశాఖలో నకిలీ నోట్ల ముఠా గుట్టు రట్టు.. రూ.3కోట్లు ఫేక్ కరెన్సీ స్వాధీనం

అదిలాబాద్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో 1.5ఎకరాల పార్క్ స్థలం ఉంది. పార్కు స్థలంలో కొంత భూమిని కబ్జాచేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన 23 మంది చిన్నారులు హైకోర్టు జస్టిస్ కు లేఖ రాశారు. చిన్నారులు రాసిన లేఖను ప్రజాప్రయోజన వ్యాజ్యంగా హైకోర్టు స్వీకరించింది. దీంతో.. కబ్జాపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో పూర్తి వివరాలు తెలపాలని రాష్ట్ర చీఫ్ సెక్రటరీ, అదిలాబాద్ కలెక్టర్ కు, పురపాలక సంఘానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ మార్చి 7వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.

Also Read : అభ్యర్థుల ప్రకటన ఇంకెప్పుడు? ఎందుకింత గందరగోళం? టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులపై ప్రొ. నాగేశ్వర్‌ విశ్లేషణ

అప్పటి మున్సిపల్ కమిషనర్ శైలజ పాత్రపై విచారణ జరపాలని, అప్పటి కమిషనర్ ను ప్రతివాదిగా చేర్చాలని న్యాయస్థానం సూచించింది. కబ్జా స్థలంలో ప్రస్తుతం అయ్యప్ప ఆలయం, ఇతర నిర్మాణాలు ఉన్నాయి.