ఆ తర్వాత ఇక్కడి నుంచి మంత్రిగా ఎవరికీ అవకాశం రాలేదు: రేవంత్ రెడ్డి

ఓట్ల కోసం మతాల మధ్య గొడవలు పెట్టాలని కొందరు ప్రయత్నిస్తున్నారని రేవంత్ రెడ్డి చెప్పారు.

CM Revanth Reddy

కొడంగల్ నియోజకవర్గం నుంచి అరవై ఏళ్ల క్రితం అచ్యుతా రెడ్డి గెలిచి మంత్రి అయ్యారని, ఆ తర్వాత ఇక్కడి నుంచి మంత్రిగా ఎవరికీ అవకాశం రాలేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలోని కొడంగల్‌లో నిర్వహించి సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఇప్పుడు కొడంగల్ నుంచి తెలంగాణ ముఖ్యమంత్రిగా సోనియా గాంధీ తనకు అవకాశం ఇచ్చారని చెప్పారు.

కొడంగల్ నియోజకవర్గానికి 100 రోజుల్లో మెడికల్, ఇంజనీరింగ్, వెటర్నరీ, నర్సింగ్ జూనియర్, డిగ్రీ కాలేజీలు తెచ్చుకున్నామని తెలిపారు. ఎందుకు రేవంత్ రెడ్డిని కిందపడేయాలని ప్రశ్నించారు. కాలేజీలు తెచ్చినందుకా? సిమెంటు ఫ్యాక్టరీలు తెచ్చి ఉపాధి కల్పిస్తున్నందుకా? అని అన్నారు.

కాంగ్రెస్‌ను ఓడించేందుకు బీజేపీ, బీఆరెస్ కుట్రలు చేస్తున్నాయని చెప్పారు. కాంగ్రెస్‌ను ఎందుకు ఓడించాలని ప్రశ్నించారు. ఆడబిడ్డలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినందుకా అని నిలదీశారు. రూ.500 లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నందుకా అని ప్రశ్నించారు.

ఓట్ల కోసం మతాల మధ్య గొడవలు పెట్టాలని కొందరు ప్రయత్నిస్తున్నారని రేవంత్ రెడ్డి చెప్పారు. తాను ఎక్కడున్నా తన గుండె చప్పుడు కొడంగల్ మాత్రమేనని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో కొడంగల్ నుంచి 50 వేల మెజారిటీ అందించాలని అన్నారు.

ఏపీలో సీపీఎం పోటీ చేయనున్న స్థానాలు ఇవే.. లోకేశ్‌పై పోటీ చేసేదీ ఎవరో తెలుసా?