ఏపీలో సీపీఎం పోటీ చేయనున్న స్థానాలు ఇవే.. లోకేశ్‌పై పోటీ చేసేదీ ఎవరో తెలుసా?

సీపీఎం, సీపీఐ పోటీ చేస్తున్న పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలలో పరస్పరం అభ్యర్థులను బలపర్చుకోవాలని ఆ ఇరు పార్టీలు అవగాహనకు వచ్చాయి.

ఏపీలో సీపీఎం పోటీ చేయనున్న స్థానాలు ఇవే.. లోకేశ్‌పై పోటీ చేసేదీ ఎవరో తెలుసా?

CPM

Updated On : April 8, 2024 / 8:05 PM IST

Andhra Pradesh CPM: ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్‌లో పోటీచేయనున్న పలు స్థానాల అభ్యర్థుల పేర్లను సీపీఎం పార్టీ ప్రకటించింది. ఇవాళ సీపీఎం రాష్ట్ర కమిటీ ఆ పేర్లను ఆమోదించినట్లు తెలిపింది. ఒక పార్లమెంటు, పది అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది.

అరకు (ఎస్టీ)లోక్‌సభ స్థానం నుంచి పాచిపెంట అప్పలనర్సయ్య పోటీ చేస్తారు. అసెంబ్లీ నియోజక వర్గాల విషయానికి వస్తే.. రంపచోడవరం (ఎస్టీ)లో లోతా రామారావు, అరకు (ఎస్టీ)లో దీసరి గంగరాజు, కురుపాం (ఎస్టీ)లో మండంగి రమణ, గాజువాకలో మరడాన జగ్గునాయుడు, విజయవాడ సెంట్రల్‌లో చిగురుపాటి బాబురావు పోటీ చేస్తారు.

మంగళగిరిలో లోకేశ్‌పై జొన్నా శివశంకర్‌ పోటీ
గన్నవరంలో కళ్లం వెంకటేశ్వరరావు, మంగళగిరిలో జొన్నా శివశంకర్‌, నెల్లూరు సిటీలో మూలం రమేశ్, కర్నూలులో డి.గౌస్‌ దేశాయి, సంతనూతలపాడు (ఎస్సీ)లో ఉబ్బా ఆదిలక్ష్మీ పోటీ చేస్తారు. మిగతా పలు స్థానాల్లో పోటీపై కాంగ్రెస్ తో చర్చలు కొనసాగుతున్నాయి.

సీపీఎం, సీపీఐ పోటీ చేస్తున్న పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలలో పరస్పరం అభ్యర్థులను బలపర్చుకోవాలని ఆ ఇరు పార్టీలు అవగాహనకు వచ్చాయి. ఏపీ ఎన్నికల వేళ ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీలు అభ్యర్థులపై తుది నిర్ణయాలు తీసుకున్నాయి.

Also Read: మోదీ గ్యారంటీ ఇదే.. ఎన్నికల ఫలితాల తర్వాత వారందరినీ..: మమతా బెనర్జీ