Cm Revanth Reddy: హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో సర్వేయర్లకు లైసెన్సుల పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధాన కారణం ఏంటో ముఖ్యమంత్రి రేవంత్ చెప్పారు. బీఆర్ఎస్ ఓటమికి ధరణి చట్టమే ప్రధాన కారణమని సీఎం రేవంత్ అన్నారు. ఆ ఒక్క చట్టం వల్లే బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిందన్నారు.
”ధరణి అనే చట్టం కొంతమంది దొరలకు చుట్టంగా మారింది. ఈ ధరణి కారణంగా ఒక ఎమ్మార్వోను పెట్రోల్ పోసి తగలబెట్టిన చరిత్ర ఈ తెలంగాణలో ఉంది. ఈ ధరణి ఇబ్రహీంపట్నంలో జంట హత్యలకు కారణమైంది. ఈ రకంగా ధరణి దోపిడీ గురించి, ధరణి చట్టాన్ని అడ్డుపెట్టుకుని ఈ భూమ్మీద ఆధిపత్యం చెలాయించి దోచుకోవాలనుకున్న దొరలకు మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పి బంగాళాఖాతంలో విసిరేశారు.
మా విజయానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. కానీ, వాళ్ల ఓటమికి ప్రధానమైన కారణం ఈ ధరణి అనే భూతం. దాన్ని పెంచి పోషించి ఈ భూమ్మీద ఆధిపత్యాన్ని సాధించాలి అని ఒక కుటుంబం, ఒక రాజకీయ పార్టీ అనుకోవడంతో.. వాళ్లకి గుణపాఠం చెప్పాలి, ఈ భూమికి విముక్తి కలిగించాలి అని 4 కోట్ల తెలంగాణ ప్రజలు నిర్ణయించి ఈనాడు ఇందిరమ్మ రాజ్యాన్ని, ప్రజాపాలనను అధికారంలోకి తీసుకొచ్చారు” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
Also Read: సీఎం స్వయంగా గన్ ఇచ్చారని మంత్రి కూతురు ఆరోపిస్తే ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు?