Sabitha Indra Reddy : సీఎం స్వయంగా గన్ ఇచ్చారని మంత్రి కూతురు ఆరోపిస్తే ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు?
Sabitha Indra Reddy నాడు కేసీఆర్ హయాంలో అన్ని వర్గాల అభివృద్ధి జరిగింది. నేడు రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని సబితా ఇంద్రారెడ్డి అన్నారు.

Sabitha Indra Reddy
Sabitha Indra Reddy : తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పింది.. సీఎం ఇంటి సమీపంలో గన్‌తో బెదిరించే పరిస్థితి నెలకొందని అన్నారు. తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ మహిళా నేతలతో కలిసి సబితా ఇంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. మిస్ వరల్డ్ పోటీల్లో మహిళకు అన్యాయం జరిగితే దానిపై క్లారిటీ లేదు.. సీఎం సొంత నియోజకవర్గంలో మహిళా జర్నలిస్టులపై కేసులు పెట్టారు. నిండు సభలో మహిళా ఎమ్మెల్యేలను అవమానించారు.. తాజాగా.. మాగంటి సునీతపై మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణం. క్యాబినెట్ మహిళా మంత్రి ఇంటిపైకి పోలీసులను పంపించారు. రాష్ట్రంలో మహిళల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి ఇది నిదర్శనమని సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
నాడు కేసీఆర్ హయాంలో అన్ని వర్గాల అభివృద్ధి జరిగింది. నేడు రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని అన్నారు. కాంగ్రెస్ హయాంలో రాష్ట్రంలో గన్ కల్చర్ తెచ్చారు. మంత్రి ఇంటిపైకి అర్ధరాత్రి పోలీసులు వెళితే దానిపై ఎఫ్ఐఆర్ ఉందా..? పోలీసులు దీనిపై ఎందుకు మౌనం వహిస్తున్నారు.. డీజీపీ దీనిపై సమాధానం చెపాలని సబితా అన్నారు. నిందితుడిని మంత్రి కారులో తీసుకుపోతే ఎందుకు కేసు పెట్టలేదు. సీఎం స్వయంగా గన్ కల్చర్ తెచ్చారని సిట్టింగ్ మంత్రి కూతురు ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేస్తే ఎందుకు వివరణ ఇవ్వలేదని సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు.
సిమెంట్ కంపెనీ యజమాని దగ్గర కంప్లైంట్ తీసుకున్నారా? ఈ అంశంలో ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. డీజీపీ బాధ్యతలు చేపట్టిన తరువాత ఏ బుక్ లేదు చట్ట ప్రకారం చర్యలు అన్నారు. సీఎంపైనే ఆరోపణలు, మంత్రులపై ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని సబితా ఇంధ్రారెడ్డి డిమాండ్ చేశారు. కాబినెట్ సమావేశంలో ఏ మంత్రి వాటా ఎంత అనే దానిపై చర్చిస్తున్నారంటూ ఆరోపించారు. ఈ అంశాలపై గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరారు. కాంగ్రెస్ ఇంచార్జితో మాట్లాడుకున్నాం అని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇది పార్టీ వ్యవహారం కాదు.. ప్రజలకు సంబంధించినది.
మేడారం జాతర పనులు ఒక శాఖ నుంచి మరో శాఖకు ఎందుకు మార్చారని సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. సిమెంట్ కంపెనీ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలి. మంచిరేవుల భూముల వ్యవహారంపై సీఎం సోదరులపై ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్రంలో ఇంత జరుగుతుంటే బీజేపీ నేతలు ఎందుకు స్పందించడం లేదు. కేంద్ర మంత్రులు ఇద్దరు ఉండి ఎందుకు విచారణ జరపరు..? కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఈ గన్ కల్చర్‌పై విచారణకు ఎందుకు ఆదేశించరు అంటూ సబిత ఇంద్రారెడ్డి ప్రశ్నించారు.
మాజీ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పాలన గాడి తప్పింది. సీఎం ఇంటి సమీపంలో గన్‌తో బెదిరించే పరిస్థితి నెలకొంది. హరీష్ రావు కాబినెట్ సమావేశంపై మాట్లాడితే మంత్రి సీతక్క తల్లిదండ్రులపై ఎందుకు ప్రమాణం చెయ్యాలి. మేడారం పనులు మాకు దక్కలేదని మీరు అనలేదా.. మీ నియోజకవర్గం కలెక్టరేట్ లో మహిళా ఉద్యోగి పట్ల లైంగిక వేధింపులపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. మాగంటి సునీతపై మంత్రులు చేసిన వ్యాఖ్యలు దౌర్భాగ్యమన్నారు. మంత్రి కూతురే ఆరోపణలు చేస్తుంటే మీ పాలన ఎలా ఉందో ప్రజలకు అర్థం అవుతుంది. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా.. ఏ ముఖంతో సంబరాలు చేసుకుంటారని ఆమె కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.