Cm Revanth Reddy : వాట్ నెక్ట్స్.. మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘ సమావేశం..

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనాలు దక్కలేదన్నది ప్రధానంగా రేవంత్ ప్రభుత్వం భావిస్తోంది.

Cm Revanth Reddy : కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మంత్రులు, ఆర్థిక శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. వివిధ శాఖలకు అవసరమైన బడ్జెట్, నిధుల సర్దుబాటుకు తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. అలాగే కేంద్ర బడ్జెట్ తో తెలంగాణకు కలిగే లాభనష్టాలపైనా అధ్యయనం చేసింది మంత్రివర్గం. వీటితో పాటు రాష్ట్ర బడ్జెట్ రూపకల్పనకు సమాలోచనలు చేశారు.

Also Read : హైదరాబాద్ గచ్చిబౌలిలో కాల్పుల కలకలం.. గన్‌తో పోలీసులపై ఫైరింగ్..

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రాష్ట్రానికి ప్రాధాన్యత దక్కలేదనే భావన..
మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం సుదీర్ఘంగా సాగిందని చెప్పుకోవచ్చు. దాదాపు ఆరున్నర గంటల పాటు ఈ సమీక్ష సమావేశం జరిగింది. ముఖ్యంగా కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రాష్ట్రానికి ప్రాధాన్యత దక్కలేదని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి కలిగే ప్రయోజనమేంటి, నష్టమేంటి అన్నదానిపై.. రంగాల వారీగా సుదీర్ఘంగా ఈ మీటింగ్ లో చర్చించారు.

రాష్ట్ర బడ్జెట్ రూపకల్పనపై సమాలోచనలు..
వివిధ శాఖలకు, రంగాలకు బడ్జెట్ అవసరాలు, నిధుల సర్దుబాటుకు సంబంధించిన అంశాలపైన చర్చ జరిగింది. దీంతో పాటు త్వరలోనే రాష్ట్ర బడ్జెట్ ను కూడా ప్రవేశపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి రాష్ట్ర బడ్జెట్ రూపకల్పనపైనా సమాలోచనలు మంత్రుల సమావేశం జరిగింది. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనాలు దక్కలేదన్నది ప్రధానంగా రేవంత్ ప్రభుత్వం భావిస్తోంది.

వాస్తవానికి కేంద్రం బడ్జెట్ పై తెలంగాణ ప్రభుత్వం భారీగానే ఆశలు పెట్టుకుంది. ప్రభుత్వం చేపట్టిన మూసీ ప్రాజెక్ట్ కు సంబంధించి ఆర్థిక సాయం అందించాలని కేంద్రాన్ని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. దాంతో పాటు ఫ్యూచర్ సిటీ, మెట్రో విస్తరణ.. ఈ అంశాలన్నింటికి కూడా నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది. దీంతో పాటు విభజన చట్టంలో పేర్కొన్న హామీలను నెరవేర్చాలంది. పదేళ్లు అవుతున్నా ఇప్పటికీ హామీల అమలు నోచుకోని పరిస్థితి. దీనికి సంబంధించి ఈ బడ్జెట్ లో ఒక స్పష్టత వస్తుందని, రాష్ట్రానికి కేంద్రం అండగా నిలుస్తుందని రేవంత్ సర్కార్ ఆశించింది.

Also Read : వామ్మో.. లైవ్ షో లో ఘోరం జరిగిపోయింది.. యువతిపై భారీ చేప ఎలా దాడి చేసిందో చూడండి..

దీంతో పాటు గత ఏడాది కాలంలో ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను కలిసి నిధులు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రుల బృందం పలు మార్లు విజ్ఞప్తి చేసిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ.. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఇవేవీ పరిగణలోకి తీసుకోలేదని, కేంద్ర పద్దులో రాష్ట్రానికి ప్రాధాన్యత దక్కలేదని రేవంత్ సర్కార్ భావిస్తోంది. ఈ అంశాలన్నింటిపైనా మంత్రులతో సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిస్కస్ చేసినట్లు తెలుస్తోంది.