Gachibowli Gun Firing : హైదరాబాద్ గచ్చిబౌలిలో కాల్పుల కలకలం.. గన్‌తో పోలీసులపై ఫైరింగ్..

గాయపడిన కానిస్టేబుల్ ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Gachibowli Gun Firing : హైదరాబాద్ గచ్చిబౌలిలో కాల్పుల కలకలం.. గన్‌తో పోలీసులపై ఫైరింగ్..

Updated On : February 1, 2025 / 11:48 PM IST

Gachibowli Gun Firing : హైదరాబాద్ గచ్చిబౌలిలో కాల్పులు కలకలం రేపాయి. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ప్రభాకర్.. కానిస్టేబుల్ వెంకటరామిరెడ్డిపై కాల్పులు జరిపాడు. ప్రభాకర్ పబ్ లోకి వస్తాడనే సమాచారంతో కొన్ని రోజులుగా పబ్ లపై నిఘా పెట్టారు పోలీసులు. ఈ క్రమంలో పబ్ కి వచ్చిన ప్రభాకర్ అక్కడ పోలీసులను చూశాడు. వెంటనే రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు.

గచ్చిబౌలిలోని ప్రిజమ్ పబ్ లో ఘటన..
ఈ ఘటనలో కానిస్టేబుల్ వెంకటరామిరెడ్డి పాదంలోకి ఒక బుల్లెట్ దూసుకెళ్లింది. పబ్ సిబ్బందితో కలిసి ప్రభాకర్ ను అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన కానిస్టేబుల్ ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గచ్చిబౌలిలోని ప్రిజమ్ పబ్ లో ఈ ఘటన జరిగింది.

Also Read : వణుకు పుట్టించే వీడియో.. ఇంటి బయట కూర్చుని ఫోన్ చూస్తున్నారా? ఎంత ప్రమాదమో చూడండి..

క్రిమినల్ ప్రభాకర్ కోసం పోలీసుల గాలింపు..
ఒక కేసు విషయంలో నిందితుడిగా ఉన్న ప్రభాకర్ కోసం పోలీసులు కొంతకాలంగా గాలిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభాకర్ ఒక పబ్ లో ఉన్నాడనే సమాచారం సైబరాబాద్ సీసీఎస్ పోలీసులకు తెలిసింది. ప్రభాకర్ ను పట్టుకోవడానికి వెళ్లారు. ఈ క్రమంలో సైబరాబాద్ సీసీఎస్ కానిస్టేబుల్ వెంకటరామిరెడ్డిపై కాల్పులు జరిపాడు ప్రభాకర్.

కానిస్టేబుల్ ఎడమ పాదానికి బుల్లెట్ గాయమైంది. కానిస్టేబుల్ వెంకట్రామిరెడ్డిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వెంకటరామిరెడ్డిని సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి, డీసీపీ వినీత్ పరామర్శించారు.

బత్తుల ప్రభాకర్ పై 80 కేసులు..
”బత్తుల ప్రభాకర్ పై 80 కేసులు ఉన్నాయి. మూడు పోలీస్ కమిషనరేట్ ల పరిధిలో 16 కేసులు ఉన్నాయి. 2023 నవంబర్ నుండి తప్పించుకుని తిరుగుతున్నాడు. పబ్ లోపలికి వెళ్లే క్రమంలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Also Read : వామ్మో.. లైవ్ షో లో ఘోరం జరిగిపోయింది.. యువతిపై భారీ చేప ఎలా దాడి చేసిందో చూడండి..

ప్రభాకర్ నుంచి 2 తుపాకులు స్వాధీనం చేసుకున్నాం. పోలీసులపై రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. కాల్పుల్లో కానిస్టేబుల్ ఎడమ కాలికి గాయమైంది. కానిస్టేబుల్ తో పాటు మరో ఇద్దరు సిబ్బంది ప్రభాకర్ ను పట్టుకునే ప్రయత్నంలో అతడు కాల్పులు జరిపాడు” అని డీసీపీ వినీత్ తెలిపారు.