Woman Attacked By Giant Fish : వామ్మో.. లైవ్ షో లో ఘోరం జరిగిపోయింది.. యువతిపై భారీ చేప ఎలా దాడి చేసిందో చూడండి..
వెనుక నుంచి వచ్చిన ఓ భారీ చేప.. సడెన్ గా దాడి చేసింది. దీంతో అంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

Woman Attacked By Giant Fish : అది ఓ పెద్ద అక్వేరియమ్ ట్యాంక్. అందులో భారీ చేప ఉంది. అదే ట్యాంక్ లో ఓ యువతి.. జలకన్య వేషధారణలో ప్రదర్శన ఇస్తోంది. జనం అంతా ఎంతో ఆసక్తిగా ఆ యువతి ప్రదర్శనను ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఇంతలో ఎవరూ ఊహించని విధంగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
అక్వేరియమ్ ట్యాంక్ లో ఉన్న భారీ చేప సడెన్ గా యువతిపై అటాక్ చేసింది. ఆమె తలను కొరికేసేందుకు ప్రయత్నించింది. దీన్ని లైవ్ లో చూసి అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. అయితే, యువతి సమయస్ఫూర్తిగా వ్యవహరించింది. భారీ చేప నుంచి తప్పించుకుని బయటపడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read : మీ జీతం ఎంత? ఎంత ట్యాక్స్ కట్ అవుతుంది? ఈ టేబుల్లో చూసుకోండి..
చైనాలోని పార్క్ లో షాకింగ్ ఘటన..
ఈ షాకింగ్ ఘటన చైనాలోని జిషువాంగ్‌బన్నా ప్రిమిటివ్ ఫారెస్ట్ పార్క్ లో చోటు చేసుకుంది. ఆ యువతి పేరు మాషా. వయసు 22 సంవత్సరాలు. రష్యాకు చెందిన మాషా.. మెర్ మైడ్ గా(జల కన్య) పార్క్ లో ప్రదర్శన ఇస్తుంది. జలకన్య వేషధారణలో భారీ అక్వేరియంలో ప్రదర్శన ఇస్తూ పార్క్ కి వచ్చే సందర్శకులను మంత్ర ముగ్దులను చేస్తుంది. భారీ ట్యాంక్ లో స్విమ్మింగ్ చేస్తూ ప్రదర్శన ఇస్తుంది. ఇదంతా లైవ్ షో. గ్లాస్ బయటి నుంచి సందర్శకులు ఆమె షో ను తిలకించి ఎంజాయ్ చేస్తారు. థ్రిల్లింగ్ అనుభూతి పొందుతారు.
Woman performing as a mermaid bitten by a sturgeon in a Chinese Aquarium. pic.twitter.com/LTDSioBve3
— Game of X (@froggyups) January 29, 2025
సడెన్ గా యువతిపై భారీ చేప దాడి..
అదే అక్వేరియమ్ ట్యాంక్ లో కొన్ని చేపలు కూడా ఉంటాయి. అందులో కొన్ని పెద్దవి కూడా ఉన్నాయి. వాటి మధ్యనే మాషా తన షో చేయాల్సి ఉంటుంది. ఇది ఆమె రోజూ చేసే పనే. అయితే, రీసెంట్ గా ఇలానే షో ఇస్తుండగా.. ఎవరూ ఊహించని విధంగా షాకింగ్ ఘటన జరిగింది. మాషా వెనుక నుంచి వచ్చిన ఓ భారీ చేప.. సడెన్ గా మాషాపై దాడి చేసింది. ఆమె తలను నోటితో కరుచుకుంది. దీంతో అంతా భయాందోళనకు గురయ్యారు. ఇంతలో మాషా సమయస్ఫూర్తిగా వ్యవహరించింది.
Also Read : వణుకు పుట్టించే వీడియో.. ఇంటి బయట కూర్చుని ఫోన్ చూస్తున్నారా? ఎంత ప్రమాదమో చూడండి..
భారీ చేప దాడిలో యువతికి గాయాలు..
చాకచాక్యంగా భారీ చేప తల నుంచి తప్పించుకుని బయటపడింది. పెద్ద ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడింది. అయితే, భారీ చేప దాడిలో ఆమె తల, మెడపై గాయాలు అయ్యాయి. భారీ చేప దాడి చేసిన సమయంలో ఆమె నొప్పితో విలవిలలాడింది. భయపడకుండా సమయస్ఫూర్తిగా తప్పించుకుని ప్రాణాలతో బయటపడింది. భారీ చేప దాడిలో మాషా సేఫ్ గా బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. భారీ చేప దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.