×
Ad

Cm Revanth Reddy: పక్క రాష్ట్రంతో గొడవలు వద్దు.. చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఒకే మాట

రెండు రాష్ట్రాలు పరస్పరం సహకరించకుంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. ఇందుకోసం పక్క రాష్ట్రంతో చర్చలు కొనసాగుతాయన్నారు.

Cm Revanth Reddy Representative Image (Image Credit To Original Source)

  • పంచాయితీ కావాలా? నీళ్లు కావాలా? అంటే నీళ్లే కావాలని కోరుకుంటా
  • రాజకీయ లబ్ది పొందాలన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదు
  • మేము వివాదం కోరుకోవడం లేదు, పరిష్కారం కోరుకుంటున్నాం

Cm Revanth Reddy: తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పందించారు. ఇద్దరూ ఒకే మాటపై నిలబడ్డారు. పక్క రాష్ట్రంతో మాకు వివాదాలు వద్దు అని చంద్రబాబు, రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. తాము వివాదాలు కోరుకోవడం లేదని, పరిష్కారం కోరుకుంటున్నామని ముఖ్యమంత్రులు స్పష్టం చేశారు. వివాదాలు వద్దు చర్చలు చేద్దాం అని పిలుపునిచ్చారు. నీళ్ల ముసుగులో రాజకీయ ప్రయోజనం పొందాలని మాకు లేదు అని చంద్రబాబు, రేవంత్ తేల్చి చెప్పారు.

పొరుగు రాష్ట్రంతో వివాదాలు కోరుకోవడం లేదన్న రేవంత్ రెడ్డి.. చర్చల ద్వారానే నీళ్ల పంచాయితీలకు సరైన పరిష్కారం వెతుకుదామన్నారు. తెలంగాణ ప్రాజెక్టులకు ఏపీ సర్కార్ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద జగన్ వివాదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుకి, మాకు మధ్య ఎలాంటి వివాదాలు రావన్నారు.

ఏపీ, తెలంగాణ మధ్య జల వివాదాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం స్పందించారు. నీళ్ల విషయంలో మాకు గొడవలు వద్దు, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అని చంద్రబాబు తేల్చి చెప్పారు. గొడవలతో ఎవరికీ ఎలాంటి ప్రయోజనం ఉండదని ఆయన స్పష్టం చేశారు.

జల వివాదాలు, ప్రాజెక్టుల అంశం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వేడిని పెంచేశాయి. జల వివాదాలు రాజకీయ రంగు పులుముకున్నాయి. నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మాకు అన్యాయం జరుగుతోంది అంటూ ఇరు రాష్ట్రాల నాయకులు ఒకరిపై మరొకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ వ్యవహారంపై తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఏపీ సీఎం చంద్రబాబుకు కీలక విజ్ఞప్తి చేశారాయన.

గొడవలు కాదు నీళ్లు కావాలి..

తెలంగాణ రాష్ట్రానికి పంచాయితీ కావాలా? నీళ్లు కావాలా? అని అడిగితే నేను నీళ్లే కావాలని కోరుకుంటాను అని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. వివాదం కావాలా? పరిష్కారం కావాలా? అని అడిగితే పరిష్కారం కావాలని కోరుకుంటానని స్పష్టం చేశారు. నీళ్ల వివాదం ముసుగులో రాజకీయ లబ్ది పొందాలన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదని చెప్పారు.

సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుందాం..

రాజకీయాలకు అతీతంగా పరిష్కారం కోసం అందరూ సహకరించాలని పార్టీలకు విజ్ఞప్తి చేశారు రేవంత్ రెడ్డి. మన సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుందాం అని పిలుపునిచ్చారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి ప్రత్యేక విజ్ఞప్తి చేశారు రేవంత్ రెడ్డి. కృష్ణా నదిపై ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టుల అనుమతులకు అడ్డంకులు పెట్టకండి అని కోరారు.

కేంద్రం నుంచి నిధులు రావడం లేదు..

అడ్డంకులతో కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావడం లేదని, రాష్ట్రంపై ఆర్ధిక భారం పడుతోందని రేవంత్ రెడ్డి వాపోయారు. మేము వివాదం కోరుకోవడం లేదు, పరిష్కారం కోరుకుంటున్నాం అని వ్యాఖ్యానించారు. రాజకీయ ప్రయోజనాలు కాదు ప్రజల ప్రయోజనాల కోసం, రైతుల ప్రయోజనాల కోసం ఆలోచిస్తున్నాం అని చెప్పారు. తెలంగాణకు పోర్టు కనెక్టివిటీ రావాలంటే పక్క రాష్ట్రం సహకారం ఉండాలని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు.

రెండు రాష్ట్రాలు పరస్పరం సహకరించకుంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. ఇందుకోసం పక్క రాష్ట్రంతో చర్చలు కొనసాగుతాయన్నారు. పక్క రాష్ట్రాలతో మేము వివాదాలు కోరుకోవడం లేదని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. అది ఏపీ అయినా, కర్ణాటక అయినా, తమిళనాడు అయినా, మహారాష్ట్ర అయినా పరస్పర సహకారమే కోరుకుంటున్నాం అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Also Read: తెలంగాణలో మరో 2 కొత్త పథకాలను ప్రారంభించిన మంత్రులు