చెరువులు ఆక్రమించిన వారిని ఎవర్నీ వదలం.. రాజకీయాలకు సంబంధం లేదు : సీఎం రేవంత్ రెడ్డి
నగరంలో చెరువుల పరిరక్షణ ఎంతో కీలకం. చెరువులు కబ్జా చేస్తే ఊరుకునేది లేదు. చెరువులు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారిని ఎవర్నీ వదలమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
- Harishth Thanniru
- Published On : August 25, 2024 / 01:24 PM IST
CM Revanth Reddy
CM Revanth Reddy : హైదరాబాద్ ప్రాంతంలోని చెరువులు, నాలాలు ఆక్రమించి నిర్మితమైన అక్రమ కట్టడాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా కూల్చివేస్తుంది. ఈ క్రమంలో పలు వర్గాల ప్రజల నుంచి ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురుస్తుండగా.. పలువురు ప్రభుత్వం తీరును వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశంపై మాట్లాడారు. చెరువులు ఆక్రమించిన వారిని ఎవర్నీ వదలమని మరోసారి క్లారిటీ ఇచ్చారు. హైదరాబాద్ ను లేక్ సిటీగా వందేళ్ల క్రితమే నిర్మించారు. అధర్మం ఓడాలంటే యుద్ధం చేయాల్సిందే. హైదరాబాద్ నగరాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని రేవంత్ రెడ్డి అన్నారు.
Also Read : సర్వేచేసి హద్దులు పెట్టండి.. ఆక్రమించినట్లు తేలితే నేనే కూల్చేస్తా : పల్లా రాజేశ్వర్ రెడ్డి
నగరంలో చెరువుల పరిరక్షణ ఎంతో కీలకం. చెరువులు కబ్జా చేస్తే ఊరుకునేది లేదు. చెరువులు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారిని ఎవర్నీ వదలమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ అంశంలో రాజకీయాలకు సంబంధం లేదు. రాజకీయ నాయకులను కొంతమందిని దృష్టిలో పెట్టుకొని చేపడుతున్న కార్యక్రమం కాదు ఇది. భవిష్యత్ తరాలకు ఈ చెరువులను సురక్షితంగా అందించాల్సిన బాధ్యత మనపై ఉంది. ప్రకృతి సంపదను మనం విధ్వంసం చేస్తే ప్రకృతి మనమీద ప్రకోపిస్తుంది. చెన్నైలో ఇదే పరిస్థితి చూశాం. ఉత్తరాఖండ్ లో, కేరళలోకూడా చూశాం.. ఇలాంటివి అన్నింటిని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ నగరాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని రేవంత్ రెడ్డి అన్నారు.
Also Read : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తుంది.. అక్రమంగా కేసులు పెడుతున్నారు : హరీశ్ రావు
హైదరాబాద్ సుందరమైన నగరం. ఈ నగరానికి చెరువులే అందం. చెరువులను కాపాడుకోవాల్సిన బాధ్యతను ప్రభుత్వం తీసుకుంది. ఎవరెన్ని అనుకున్నా.. ఎవరు ఏ ఒత్తిడి తెచ్చినా.. వాటన్నింటిని పక్కనపెట్టి చెరువులను ఆక్రమించిన వారి భరతం పడతామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
