కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తుంది.. అక్రమంగా కేసులు పెడుతున్నారు : హరీశ్ రావు

ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్లు దొరకడం లేదు. కొన్ని వేల మంది చికెన్ గున్యా, డెంగ్యూలతో బాధపడుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ మందులు కూడా లేవు..

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తుంది.. అక్రమంగా కేసులు పెడుతున్నారు : హరీశ్ రావు

BRS MLA Harish Rao

BRS MLA Harish Rao :  కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. రాష్ట్రంలో పాలన పడకేసింది. డెంగ్యూతో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. అర్హులందరికీ రుణమాఫీ చేయకుండానే రోజుకో మాట మాట్లాడుతున్నారు. ప్రభుత్వంపై రోజురోజుకు ప్రజల నుంచి పెల్లుబికుతున్న వ్యతిరేకను పక్కదారి పట్టించేందుకు హైడ్రా పేరుతో ప్రతిపక్ష పార్టీల నేతలను టార్గెట్ చేస్తున్నారని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తూ.. ఆర్థికంగా, రాజకీయంగా ఇబ్బంది పెట్టే కుట్ర చేస్తున్నారని హరీశ్ రావు అన్నారు.

Also Read : Hyderbad Metro : ఉప్పల్ మెట్రో స్టేషన్ వద్ద ప్రయాణికుల ధర్నా.. అధికారుల తీరుపై ఆగ్రహం

హైడ్రా పేరుతో రాత్రికి రాత్రి కూల్చివేతలకు ప్రభుత్వం దిగుతుంది. హైడ్రాకు బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకం కాదు.. అక్రమ కట్టడాలు ఉంటే కూల్చి వేయండి.. మేము సహకరిస్తాం. కానీ, హైడ్రా పేరుతో ప్రతిపక్ష పార్టీల నేతలకు సంబంధించిన నిర్మాణాలపై ఉద్దేశపూర్వకంగా దాడులు చేయడం సరికాదని హరీశ్ రావు ప్రభుత్వానికి సూచించారు. మా పార్టీ నేతలను భయపెట్టి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే పనిలో రేవంత్ రెడ్డి ఉన్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి విద్యా సంస్థలకు అన్ని అనుమతులు ఉన్నాయి. రాజేశ్వర్ రెడ్డితో పాటు వారి కుటుంబ సభ్యులపైన పోలీసులు అక్రమంగా కేసులు పెడుతున్నారు. మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి విద్యా సంస్థలకు సీట్లకు అనుమతి ఇవ్వలేదు. విద్యా సంస్థలు, అసుపత్రులను కూల్చివేసేందుకు కక్షసాధింపు చర్యలకు ప్రభుత్వం పాల్పడుతోందని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read : Dream Home : ముచ్చర్లలో కలల నగరం.. మరో సిటీ నిర్మాణానికి ప్రభుత్వం ప్లాన్‌!

ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్లు దొరకడం లేదు. కొన్ని వేల మంది చికెన్ గున్యా, డెంగ్యూలతో బాధపడుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ మందులు కూడా లేవు. ప్రభుత్వం కనీసం సమీక్ష చేయలేదు. రాష్ట్రంలో పారిశుద్ధ్య పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. రాష్ట్రంలో హెల్త్ అత్యవసర పరిస్థితి ఏర్పడుతోంది. అయినా ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తుందని హరీశ్ రావు అన్నారు. కేవలం ప్రతిపక్ష పార్టీల నేతలను టార్గెట్ చేయటానికే అధికారంలోకి వచ్చామన్నట్లుగా కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్నారని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. రుణమాఫీ విషయంలోనూ ప్రభుత్వం సరియైన సమాధానం ఇవ్వడం లేదు. అర్హులైన ప్రతీ ఒక్కరికి రుణమాఫీ చేయాలి. పూర్తిస్థాయిలో రుణమాఫీ ఎప్పటి వరకు పూర్తిచేస్తారో తేదీని ప్రకటించాలని హరీశ్ రావు అన్నారు.