Hyderbad Metro : ఉప్పల్ మెట్రో స్టేషన్ వద్ద ప్రయాణికుల ధర్నా.. అధికారుల తీరుపై ఆగ్రహం
అనేక మెట్రో స్టేషన్ల వద్ద కనీస సౌకర్యాలు లేకుండానే పార్కింగ్ ఫీజును వసూళ్లు చేస్తున్నారని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రీ పార్కింగ్ ఎత్తివేయడం సరియైన పద్దతి కాదని ..

Hyderbad Metro
Hyderbad Metro Parking Fee : మెట్రో స్టేషన్ల వద్ద పెయిడ్ పార్కింగ్ కు నిరసనగా ప్రయాణీకులు ధర్నా చేపట్టారు. మియాపూర్, ఉప్పల్ మెట్రో స్టేషన్ల వద్ద పార్కింగ్ ఫీజు వసూళ్లు చేయాలని నిర్ణయించిన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం ఉప్పల్ మెట్రో స్టేషన్ వద్ద ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ప్రొగ్రెసివ్ యూత్ లీగ్ నేతలు ప్రయాణీకులకు మద్దతుగా నిలిచారు. హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు పార్కింగ్ ఫీజు వసూలు చేయాలని నిర్ణయించడం సరికాదన్నారు. ఇలా చేయడం వల్ల ప్రయాణికులపై అదనపు భారం పడుతుందని ప్రయాణీకులు ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read : Population In Metro Cities : మెట్రో నగరాలపై విపరీతంగా పెరుగుతున్న జనభారం
అనేక మెట్రో స్టేషన్ల వద్ద కనీస సౌకర్యాలు లేకుండానే పార్కింగ్ ఫీజును వసూళ్లు చేస్తున్నారని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రీ పార్కింగ్ ఎత్తివేయడం సరియైన పద్దతి కాదని ప్రయాణికులు రోడ్డెక్కారు. పెయిడ్ పార్కింగ్ విధానాన్ని పూర్తిగా విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.