పర్యాటక కేంద్రంగా మూసీ.. అక్కడ వారి విగ్రహాలు పెడతాం.. కృష్ణ, గోదావరిలో హక్కుపై రాజీపడేది లేదు .. సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy : మూసీని పునరుజ్జీవం చేస్తాం.. సబర్మతి, యమునా, గంగాలకు దీటుగా మూసీని నిర్మిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

CM Revanth Reddy,

CM Revanth Reddy : మూసీని పునరుజ్జీవం చేస్తాం.. సబర్మతి, యమునా, గంగాలకు దీటుగా మూసీని నిర్మిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. డిసెంబర్ 9లోగా మూసీ పునరుజ్జీవ పథకానికి శ్రీకారం చుడతామని చెప్పారు. పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు.

రాచరికానికి గోరికట్టి ప్రజాపాలనకు హారతి పట్టిన రోజు సెప్టెంబర్ 17. తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత మంచి చేయడమే బాధ్యతగా మా పాలన సాగుతుంది. ప్రతి పేదవాడిలో సంతోషమే ప్రభుత్వం లక్ష్యం. స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయంలో తెలంగాణను దేశంలో రోల్ మోడల్ గా నిలుపుతామని రేవంత్ రెడ్డి అన్నారు.

మూసీ పునరుజ్జీవం చేస్తాం. సబర్మతి, యమునా, గంగాలకు ధీటుగా మూసీని నిర్మిస్తాం. మూసీ ఒడ్డున ఉన్న పేదలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. వారి జీవన ప్రమాణాలు పెంచే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుంది. మూసీ కారిడార్‌ను అభివృద్ధి‌కి చిరునామా చేస్తాం. పర్యాటక కేంద్రంగా మూసీని నిలబెదాతాం. ఆ ప్రాంతంలో తెలంగాణ చరిత్రకారుల విగ్రహాలు పెడతాం. ఎన్ని అడ్డంకులు వచ్చిన నిలబడతా.. మూసీని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

విద్యా వ్యవస్థలో విశ్వ స్థాయి ప్రమాణాలను పున నిర్మిస్తున్నామని తెలిపారు. భవిష్యత్ విజన్.. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్. సివిల్స్‌కు ఎంపికైన వారికి రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం ఇస్తున్నాం. గాంధీ సివిల్స్ అభయ హస్తం అందుకున్నవారు.. ఇప్పుడు పదిమంది ఐఏఎస్‌లు అయ్యారని చెప్పారు.

మహిళలకి పెట్రోల్ బంక్ లు, ఉచిత బస్సు, డ్వాక్రా సంఘాలతో మహిళా మార్ట్ లు.. ఇలా మహిళలకు పెద్దపీట వేస్తూ మహిళా సాధికారత పెంచుతున్నాం. రుణమాఫీ చేసి రైతు సంక్షేమ చేసిన రాష్ట్రం దేశంలోనే తెలంగాణ. తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు రైతు భరోసా ఇచ్చిన ప్రభుత్వం తెలంగాణ. చివరి గింజ వరకు రైతుల నుండి ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. సన్నాలకు బోనస్ ఇస్తున్నాం. 2 కోట్ల 90 లక్షలు టన్నుల ధాన్యం పండించి.. దేశంలో అగ్రస్థానం లో తెలంగాణ నిలిచిందని సీఎం రేవంత్ అన్నారు. పేదలకు ప్రతి నియోజకవర్గకు 3,500 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చాం. ఇందిరమ్మ ఇండ్ల తో పేదల ఆత్మగౌరవం నిలబెట్టామని అన్నారు.

ఒక్క చుక్క కూడా వదలం..
కృష్ణ, గోదావరిలో ప్రతి చుక్క హక్కుపై రాజీపడేది లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. న్యాయ పోరాటానికి ప్రభుత్వం సిద్ధం. గత పాలకులు నిర్లక్ష్యం చేశారు. కృష్ణాలో 904 టీఎంసీ సాధించేందుకు ప్రభుత్వం వాదన వినిపిస్తాం. మన వాటా సాధించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎవరు అడ్డంకులు కల్పించిన ఎస్ఎల్బీసీని పూర్తిచేస్తామని చెప్పారు. వచ్చే వందేళ్లకు సరిపడా తాగునీరు కోసం గోదావరి నీళ్లు తెస్తున్నామని చెప్పారు.

ఉక్కుపాదంతో అణిచివేస్తాం..
త్యాగాలకు చిహ్నమైన తెలంగాణలో మత్తుకు స్థానం లేదు. కొందరు యువత గంజాయి, డ్రగ్స్‌తో పెడదోవ పడుతున్నారు. డ్రగ్స్ దందాను అడ్డుకోవడం కొందరికి నచ్చకపోయినా వెనకడుగు వేయం. ఉక్కుపాదంతో అణిచివేస్తాం. డ్రగ్స్ దందాలో ఎవరి బంధువులు ఉన్న వదలిపెట్టం. ఫామ్‌హౌస్‌లోనే కాదు బొక్కలో ఉన్నా వదిలిపెట్టం. తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ స్టేట్‌గా నిలబడతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజలు మీరు ప్రభుత్వంతో కలిసి రండి అంటూ రేవంత్ రెడ్డి కోరారు.

ప్యూచర్ సిటీకి బుల్లెట్ రైలు..
ప్యూచర్ సిటీ నిర్మాణాన్ని అడ్డుకోవాలని కొందరు ప్రయత్నం చేస్తున్నారు. మంచి చేస్తుంటే వారు తట్టుకోలేరు. అందుకే రైతులను రెచ్చగొడుతున్నారు. ప్యూచర్ సిటీపై రైతులకు అవగాహన కల్పిస్తాం. సిటీ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలి. రైతులకు సరైన నష్టపరిహారం ఇస్తాం. వారిని ఆదుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్యూచర్ సిటీకి బుల్లెట్ రైలు కూడా రానుందని చెప్పారు. అభివృద్ధిని అడ్డుకుంటూ రాజకీయ స్వార్థంతో కొందరు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికలప్పుడే జెండాలు ఎజెండాలు. మా ప్రభుత్వం లక్ష్యం అభివృద్ధి, సంక్షేమం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.