Cm Revanth Reddy: మాజీ సీఎం కేసీఆర్ టార్గెట్ గా నిప్పులు చెరిగారు సీఎం రేవంత్ రెడ్డి. ఓ రేంజ్ లో కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి కేసీఆర్ తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దీనికి అంతే ఘాటుగా బదులిచ్చారు సీఎం రేవంత్. కొడంగల్ లో కొత్త సర్పంచుల ఆత్మీయ సమ్మేళనంలో రేవంత్ మాట్లాడారు. కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. నేను రాజకీయాల్లో ఉన్నంత కాలం.. కేసీఆర్ ను అధికారంలోకి రానివ్వను.. ఇదే నా శపథం అని ముఖ్యమంత్రి రేవంత్ అన్నారు.
”అయ్య పేరు చెప్పుకుని బతికే నువ్వు.. గుంటూరు, గుడివాడలో చదువుకున్నావు.. నీకేం తెలుసు తెలంగాణ గురించి, మా పౌరుషం గురించి. నువ్వు కాదు మొత్తం నీ జాతినంతా తెచ్చుకో. ఎక్కడికి రావాలో చెప్పు. నువ్వు మా ఊరికన్నా రా, మేము నీ ఊరికన్నా వస్తాం. ఎవరు భయపడుతున్నారో సంగతి తేలుస్తా. గతంలో చెప్పా.. గజ్వేల్ కి వస్తా నీ నెత్తి మీద కాలు పెట్టి తొక్కుతా అని చెప్పా.
ఇవాళ చెబుతున్నా మీడియా మిత్రులు రాసుకోండి.. 2029 ఎన్నికల్లో (ఒకవేళ 119 సీట్లే ఉంటే).. 80కి పైగా సీట్లతో మా ప్రభుత్వం ఏర్పాటవుతుంది. ఒక వేళ 150 సీట్లకు పెరిగితే 100కు పైగా సీట్లతో తెలంగాణలో గెలుస్తాం, రెండోసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెస్తాం. ఇది మా సవాల్. కేసీఆర్, కేటీఆర్, హరీశ్, దయాకర్ రావు, వినోద్, కృష్ణారావు.. 2029లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా, ఇది నా సవాల్ చేతనైతే కాసుకో.
నీ రాజకీయం ఏంటో నేను చూస్తా. నేను రాజకీయం చేసినంత కాలం కాలకూట విషం లాంటి కేసీఆర్ కుటుంబాన్ని అధికారంలోకి రానివ్వను ఇదే నా శపథం. కొడంగల్ బిడ్డగా ఈ గడ్డ మీద నుంచి శపథం చేస్తున్నా. నేను రాజకీయాల్లో ఉన్నంత కాలం రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబానికి అధికారం అనేది ఇక కల. బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ చరిత్ర ఖతమే. మీ పార్టీకి, మీకు భవిష్యత్తు లేదు. ఎవడైనా చర్చించుకుంటే పొద్దుపోనప్పుడు మాట్లాడుకోవడానికి పనికొచ్చే చరిత్ర తప్ప.. భవిష్యత్తు తెలంగాణ రాష్ట్రానికి మీ వల్ల ఒరిగేది ఏమీ లేదు” అంటూ నిప్పులు చెరిగారు సీఎం రేవంత్ రెడ్డి.
Also Read: HCU పరీక్షలో రోబో తరహా సీన్.. అక్కడ చిట్టి, ఇక్కడ ఏఐ.. హైటెక్ కాపీయింగ్ మామూలుగా లేదుగా..