Mass Copying: HCU పరీక్షల్లో రోబో తరహా సీన్.. అక్కడ చిట్టి, ఇక్కడ ఏఐ.. మాస్‌ కాపీయింగ్‌ మామూలుగా లేదుగా..

పోలీసులు నిందితుల నుంచి స్కానర్లు, బ్లూటూత్‌ స్వాధీనం చేసుకున్నారు.

Mass Copying: HCU పరీక్షల్లో రోబో తరహా సీన్.. అక్కడ చిట్టి, ఇక్కడ ఏఐ.. మాస్‌ కాపీయింగ్‌ మామూలుగా లేదుగా..

Updated On : December 24, 2025 / 6:45 PM IST

Mass Copying: మీరు రోబో సినిమా చూశారా? అందులో హీరోయిన్ ఎగ్జామ్ గురించి టెన్షన్ పడుతూ ఉంటుంది. టైమ్ అయిపోయింది, ఏమీ చదువుకోలేదు, ఫెయిల్ అయిపోతాను అని బాధపడుతూ ఉంటుంది. అదే సమయంలో రోబో అక్కడికి వస్తుంది. హీరోయిన్ బాధ చూసి తట్టుకోలేకపోతుంది. నీ బదులు నేను ఎగ్జామ్ రాస్తాను అని చెబుతుంది. అదెలా సాధ్యం అని హీరోయిన్ అంటుంది. ఫోటో ఐడీ, ఎగ్జామ్ కార్డ్ అన్నీ ఉన్నాయి, నువ్వు రాయటం కుదరదని చెబుతుంది. దానికి ఓ దారి ఉందని రోబో బదులిస్తుంది. రోబో ఎగ్జామ్ సెంటర్ బయట గార్డెన్ లో కూర్చుంటుంది. హీరోయిన్ బ్లూ టూత్ పెట్టుకుని ఉంటుంది. రోబో సమాధానాలు చెబుతుంటే.. హీరోయిన్ సమాధానాలు రాస్తుంది. దీనికి కారణం రోబో దగ్గర బిల్డ్ ఇన్ డేటా ట్రాన్స్ మీటర్ ఉండటం, హీరోయిన్ చెవిలో ట్రాన్స్ రిసీవర్ ఉండటం. రోబో చెబుతుంటే.. అది హీరోయిన్ కు వినిపిస్తూ ఉంటుంది. దీన్నే జిగ్ బీ ప్రోటోకాల్ అంటారు. ఇందులో బిల్డ్ ఇన్ ట్రాన్స్ మీటర్, ట్రాన్స్ రిసీవర్ సాయంతో కాపీయింగ్ జరుగుతుంది.

ఇప్పుడు రోబో సినిమా గురించి ఇంత ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. అచ్చం ఇలాంటి సీన్.. రియల్ లైఫ్ లోనూ కనిపించింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోబో సినిమాలోని కాపీయింగ్ సీన్ వెలుగుచూసింది.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరీక్షల్లో కలకలం రేగింది. మాస్ కాపీయింగ్ వెలుగు చూసింది. అత్యాధునిక సాంకేతికత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ను కాపీయింగ్ కు వాడేశారు. ఏఐతో కాపీయింగ్‌కు పాల్పడ్డారు ఇద్దరు యువకులు. వారిని అరెస్ట్ చేశారు. షర్ట్‌ బటన్‌లో మైక్రో స్కానర్లు అమర్చుకున్నారు యువకులు. బ్లూటూత్‌లో వింటూ పరీక్ష రాశారు. ఇది ఇన్విజిలిటేర్ గమనించాడు. దాంతో వారి బండారం బట్టబయలైంది. ఇన్విజిలేటర్ ఇద్దరు యువకులను పోలీసులకు అప్పగించారు. పోలీసులు నిందితుల నుంచి స్కానర్లు, బ్లూటూత్‌ స్వాధీనం చేసుకున్నారు. ఏఐ ద్వారా కాపీయింగ్ కు పాల్పడిన అంశం కలకలం రేపింది.

Also Read: భారతీయులకు షాక్.. హెచ్‌-1బీ లాటరీ ఇక ఉండదు.. వర్క్‌ వీసాల జారీ ఇకపై ఇలా..