×
Ad

Cm Revanth Reddy: సినిమాల పైరసీపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్.. పోలీసులకు కీలక ఆదేశాలు..

ఐ-బొమ్మ రవి అరెస్ట్ తర్వాత అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం.. పైరసీని అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దృష్టి సారించింది.

Cm Revanth Reddy: సినిమాల పైరసీపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. పైరసీని అరికట్టాలని అధికారులను ఆదేశించారు. దీని కోసం ప్రత్యేక వింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులతో చర్చించిన సీఎం రేవంత్.. సినిమాల పైరసీ, సైబర్ నేరాలపై పోలీస్ శాఖకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఐ-బొమ్మ రవి అరెస్ట్ తర్వాత అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం.. పైరసీని అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దృష్టి సారించింది.

సినిమాల పైరసీ అంశంపై ఉక్కుపాదం మోపాలని పోలీస్ శాఖను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఐ బొమ్మ రవి అరెస్ట్ తర్వాత పైరసీకి సంబంధించి అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులతో ముఖ్యమంత్రి రేవంత్ చర్చించినట్లు తెలుస్తోంది. సినిమాల పైరసీ విషయంలో కఠినంగా వ్యవహరించాలని సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు.

పైరసీ కారణంగా సినీ పరిశ్రమకు పెద్ద ఎత్తున నష్టం జరుగుతోందని, కాబట్టి కఠిన చర్యలు తీసుకోవాలని సినీ ప్రముఖులు ముఖ్యమంత్రిని వేడుకున్నారు. దీంతో ఈ అంశంపై సీరియస్ గా దృష్టి సారించాలని పోలీస్ శాఖను ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశించారు. పైరసీ మాత్రమే కాకుండా సైబర్ నేరాలపైనా ఉక్కుపాదం మోపాలని సీఎం రేవంత్ చెప్పారు. సైబర్ నేరాల నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను ఆదేశించారు. వీటి కోసం ప్రత్యేక వింగ్ ఏర్పాటు చేయాలన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో నివేదిక తయారు చేసి తనకు అందించాలని పోలీస్ శాఖను ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశించినట్లు సమాచారం.

Also Read: అమ్మాయిలపై డైరెక్టర్ అసభ్యకరమైన కామెంట్స్.. సుధీర్ కూడా ఏం అనలేదు.. ఇదేనా మహిళకు ఇచ్చే గౌరవం..