Divya Bharathi: అమ్మాయిలపై డైరెక్టర్ అసభ్యకరమైన కామెంట్స్.. సుధీర్ కూడా ఏం అనలేదు.. ఇదేనా మహిళకు ఇచ్చే గౌరవం..

సుడిగాలి గురించి హీరోయిన్ దివ్య భారతి(Divya Bharathi) షాకింగ్ కామెంట్స్ చేసింది. సినిమా షూటింగ్ టైంలో అంత జరుగుతున్నా ఆయన ఇంతకుడా రియాక్ట్ అవలేదు. ఇదేనా మహిళలకు ఇచ్చే గౌరవం అంటూ సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యింది.

Divya Bharathi: అమ్మాయిలపై డైరెక్టర్ అసభ్యకరమైన కామెంట్స్.. సుధీర్ కూడా ఏం అనలేదు.. ఇదేనా మహిళకు ఇచ్చే గౌరవం..

Heroine Divya Bharathi sensational comments on director Naresh Kuppili

Updated On : November 20, 2025 / 2:16 PM IST

Divya Bharathi: సుడిగాలి గురించి హీరోయిన్ దివ్య భారతి షాకింగ్ కామెంట్స్ చేసింది. సినిమా షూటింగ్ టైంలో అంత జరుగుతున్నా ఆయన ఇంతకుడా రియాక్ట్ అవలేదు. ఇదేనా మహిళలకు ఇచ్చే గౌరవం అంటూ సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యింది. దీంతో హీరోయిన్ దివ్య భారతి(Divya Bharathi) పెట్టిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. గాలోడు సినిమా సక్సెస్ తరువాత సుడిగాలి సుధీర్ కి మంచి మార్కెట్ ఏర్పడింది. ఈ నేపధ్యంలోనే ఆయన హీరోగా “ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం” అనే సినిమా కూడా మొదలయ్యింది. దివ్య భారతి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను పాగల్ మూవీ ఫేమ్ దర్శకుడు నరేష్ తెరకెక్కించాడు.

Varanasi: “వారణాసి” టైటిల్ వివాదం.. ఫిలిం ఛాంబర్ లో ఫిర్యాదు.. చిక్కుల్లో రాజమౌళి

ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన సాంగ్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక అప్పటినుంచి ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది అని సుధీర్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కానీ, అనుకోకుండా ఈ సినిమా నుంచి దర్శకుడు నరేష్ తప్పుకున్నాడు. దాంతో, ఈ సినిమా షూటింగ్ ఆగయిపోయింది. ఇక ఆ తరువాత చాలా కాలం గ్యాప్ తీసుకున్న సుధీర్ ఈమధ్యే హైలెస్సో సినిమా పాన్ ఇండియన్ సినిమాను మొదలుపెట్టాడు. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. అయితే, తాజాగా “ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం” సినిమాకు కొత్త దర్శకుడు దొరకడంతో మళ్ళీ ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టారు మేకర్స్.

ఈ విషయాన్ని తెలియజేస్తూ ఒక పాటను కూడా విడుదల చేశారు. ఈ పాటపై చిత్ర మొదటి దర్శకుడు నరేష్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. “ఏమి లేబర్ ఉన్నావ్ రా నువ్వు. ఎడిటింగ్ లో తీసేసిన షాట్స్ తో మిగతా సినిమా తీసేలా ఉన్నవే. రెండవ హీరోయిన్ పాటను ఈ చిలక తో చేశావ్. కనీసం ట్యూన్ అయినా మంచిది పెట్టాలి కదా. పాటలో “స్టెప్పమ్ కొట్టి దప్పమ్ వేయనా” అనే లిరిక్ విని రెండు చేతులు గుండుపై పెట్టుకొని”అంటూ వ్యంగ్యంగా కామెంట్స్ చేశాడు. దానికి సీరియస్ గా రియాక్ట్ అయ్యింది హీరోయిన్ దివ్య భారతి. “ఒక ఆడపిల్లని చిలక అని సంబోధిస్తున్నాడు ఈ డైరెక్టర్. ఇదేనా మహిళను గౌరవించే తీరు. ఇప్పుడే కాదు, షూటింగ్ టైంలో కూడా నా పై, మహిళలపై నీచమైన కామెంట్స్ చేసేవాడు. హీరో సుధీర్ కూడా ఇదంతా చూస్తూ సైలెంట్ గా ఉండిపోవడం నాకు బాధ కలిగించింది” అంటూ రియాక్ట్ అయ్యింది. దీంతో ఆమె చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది.