Cm Revanth Singapore Tour : సింగపూర్ టూర్ లో తొలిరోజు సీఎం రేవంత్ సర్కార్ కీలక ఒప్పందం.. ఐటీఈతో స్కిల్ యూనివర్సిటీ ఎంవోయూ

రాష్ట్రంలో కూడా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్న నేపథ్యంలో ఆ దేశంలోని కోర్సులు, ప్రణాళికలు, నిర్వహణ విధానంపై అధ్యయనం చేస్తున్నారు.

Cm Revanth Singapore Tour : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్ టూర్ తొలిరోజు బిజీబిజీగా సాగింది. తెలంగాణ రైజింగ్ ప్రధాన అజెండాగా పలు కంపెనీల ప్రతినిధులతో వరుసగా భేటీ అయ్యింది రేవంత్ టీమ్. ఇవాళ ఉదయం సింగపూర్ విదేశాంగ మంత్రి వివియన్ బాలక్రిష్ణన్ తో రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలను ఆయనకు వివరించారు. గ్రీన్ ఎనర్జీ, మూసీ పునరుజ్జీవనం, పర్యాటకం, విద్య, ఐటీ, నైపుణ్య నిర్మాణంపై ఈ సమావేశంలో చర్చించారు.

క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలపై చర్చ..
సింగపూర్ లో జరుగుతున్న అభివృద్ధి పనులతో పాటు తెలంగాణలో ప్రణాళికలపై వారు ప్రధానంగా చర్చించారు. నిధుల సమీకరణ గురించి సమాలోచనలు చేశారు. రాష్ట్రంలో కొత్తగా ప్రారంభమైన క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ, దానికున్న అవకాశాలపై ఈ భేటీలో చర్చ జరిగింది. సింగపూర్ లో మరో రెండు రోజుల పాటు పర్యటించనుంది సీఎం రేవంత్ బృందం. రాష్ట్రంలో కూడా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్న నేపథ్యంలో ఆ దేశంలోని కోర్సులు, ప్రణాళికలు, నిర్వహణ విధానంపై అధ్యయనం చేస్తున్నారు.

Also Read : కాంగ్రెస్ పాలనపై కేసీఆర్‌ సర్వే రిపోర్ట్ ఏం చెబుతోంది.?

సింగపూర్ కు చెందిన ఐటీఈతో కీలక ఒప్పందం..
సింగపూర్ పర్యటనలో ఉన్న రేవంత్ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు ఇప్పటికే ప్రభుత్వం ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. సింగపూర్ కు చెందిన ఐటీఈతో (ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్) కీలకమైన ఒప్పందం జరిగింది. తెలంగాణ యువతకు స్కిల్ యూనివర్సిటీ అన్నది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ యూనివర్సిటీకి శ్రీకారం చుట్టింది రేవంత్ ప్రభుత్వం.

Cm Revanth Team In Singapore (Photo Credit : Facebook)

ఐటీఈ సెంటర్ ను సందర్శించిన సీఎం రేవంత్ టీమ్..
ఈ నేపథ్యంలో సింగపూర్ అభివృద్దిలో కీలకంగా ఉన్న సింగపూర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సెంట్రల్ కాలేజ్ తో ఒప్పందం చేసుకుంది. యూనివర్సిటీకి సంబంధించి వివిధ డొమైన్లను సీఎం రేవంత్ పరిశీలించారు. క్యాంపస్ మొత్తం ఆయన తిరిగారు. అక్కడున్న అధికారులు, సిబ్బంది, కాలేజీ డైరెక్టర్లతో చర్చలు జరిపారు. ఈరోజు జరిగిన ఒప్పందం తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి చాలా ఉపయోగకరంగా ఉండనుందని సీఎం రేవంత్ టీమ్ అభిప్రాయపడింది. రేపు, ఎల్లుండి కూడా సీఎం రేవంత్ బృందం సింగపూర్ లోనే ఉండబోతోంది.

* సింగపూర్ టూర్ లో తొలిరోజు సీఎం రేవంత్ కీలక ఒప్పందం
* సింగపూర్ కు చెందిన ఐటీఈతో ఒప్పందం కుదుర్చుకున్న తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ
* వేల సంఖ్యలో ఉద్యోగాలకు అవకాశం
* సింగపూర్ లోని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సెంటర్ ను సందర్శించిన రేవంత్ టీమ్
* యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ గురించి వివరించిన సీఎం రేవంత్
* ఈ ఉదయం సింగపూర్ విదేశాంగ మంత్రి వివియన్ బాలక్రిష్ణతో రేవంత్ టీమ్ భేటీ

Also Read : నవ్యాంధ్రలో కూటమి ఫ్యూచర్‌కు తిరుగులేదా? బాబు, పవన్‌ మాటల్లో లాంగ్‌ టర్మ్ వ్యూహం ఉందా?