మాజీ సీఎం కేసీఆర్ సూచనలతోనే అప్పట్లో విభజన చట్టం రూపొందించారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆరే ఈ చట్టానికి, పుస్తకానికి రచయిత అని చెప్పారు. ప్రజలను గందరగోళానికి గురి చేసి లబ్ధిపొందాలని చూస్తున్నారని అన్నారు.
కృష్ణా జలాల వివాదంపై రేవంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. బీఆర్ఎస్ పాపాలను కాంగ్రెస్ పై నెట్టేసే కుట్రలు జరుగుతున్నాయని చెప్పారు. విభజన చట్టంలోని ప్రతి అక్షరాన్ని తనను అడిగే రాశారని గతంలో కేసీఆర్ చెప్పారని అన్నారు.
రేవంత్ రెడ్డి కామెంట్స్
కేసీఆర్ ఎంపీగా ఉన్నప్పుడే ఇవన్నీ జరిగాయి
విభజన చట్టం రావడానికి కారణం కేసీఆరే
సంతకాలు పెట్టిన మీటింగ్ మినిట్స్ నేను చూపిస్తున్నాను
ఇప్పుడు విభజన చట్టం వల్ల రాష్ట్రానికి ఏదైనా జరిగితే దానికి కేసీఆరే బాధ్యుడు
బీఆర్ఎస్ ఆమోదంతోనే విభజన చట్టం వచ్చింది
కృష్ణా జలాలను ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలు కేటాయించారు
తెలంగాణకు 299 టీఎంసీలు చాలని అప్పట్లో కేసీఆర్ అన్నారు