Peddireddy Ramachandra Reddy: అందుకే వీరికి పార్టీ టికెట్ నిరాకరించింది: మంత్రి పెద్దిరెడ్డి
ఎన్నికల సమయంలో అసంతృప్తి సహజంగా ఉంటుందని పెద్దిరెడ్డి తెలిపారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సరైన పనితీరు కనబరచని..

peddireddy ramachandrareddy
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ చోటుచేసుకుంటున్న పరిణామాలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
తిరుపతిలో అటవీ శాఖ నూతన వాహనాలను ప్రారంభించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
ఎన్నికల సమయంలో అసంతృప్తి సహజంగా ఉంటుందని పెద్దిరెడ్డి తెలిపారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సరైన పనితీరు కనబరచని వారికి పార్టీ టికెట్ నిరాకరించిందని తెలిపారు. ఎన్నికల్లో గెలిచే వారికే టికెట్ ఇవ్వాలని ఆలోచనలో పార్టీ ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే చనిపోయిందని ఆయన వ్యాఖ్యలు చేశారు.
షర్మిల, కేవీపీ, రఘువీరా రెడ్డి, గిడుగు రుద్రరాజు కాంగ్రెస్ పాడె మోస్తున్నారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చంద్రబాబు, కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా రానున్న ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్ భారీ విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.
ఏపీ ఎన్నికల వేళ పలువురు సిట్టింగుల మార్పులు, చేర్పులు చేస్తూ వైసీపీ అధిష్ఠానం నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో కొందరు వైసీపీ నేతలు ఇతర పార్టీల్లో చేరుతున్నారు.
కేసీఆరే ఈ చట్టానికి, పుస్తకానికి రచయిత: రేవంత్ రెడ్డి ఆగ్రహం