CM Revanth Reddy : ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో గిగ్ వర్కర్స్‌తో సమావేశం.. ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి

నాపంల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో గిగ్ వర్కర్స్‌తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ప్రొఫషనల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి సీఎం రేవంత్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. 

CM Revanth Reddy

CM Revanth Reddy meet gig workers : నాపంల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో గిగ్ వర్కర్స్‌తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ప్రొఫషనల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి సీఎం రేవంత్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు.  స్విగ్గి,జొమాటో, ఆటో డ్రైవర్లు, ఓలా క్యాబ్ డ్రైవర్లు,ఊరబర్, ర్యాపిడో వర్కర్ల సమస్యలపై చర్చిస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యాలు కల్పించటం వల్ల తాము ఎలా నష్టపోయారో..ఉపాధి కోల్పోయి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో సీఎం రేవంత్‌కు వివరిస్తున్నారు.

కాగా.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారిగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఎన్నికల హామీల్లో భాగంగా ఆరు గ్యారెంటీలను ప్రకటించింది. ఈక్రమంలో అధికారంలోకి వచ్చి..బాధ్యతలు చేపట్టిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి మహాలక్ష్మి పథకం అమలు చేపట్టారు. దీంట్లో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించారు. ఈ పథకానికి తెలంగాణ వ్యాప్తంగా భారీ స్పందన వచ్చింది.

మహిళలు చక్కగా దర్జాగా ఆర్టీసీ బస్సులో తిరుగుతున్నారు. దీంతో ఆటో, ఉబర్, ఓలా  సిబ్బంది ఉపాధి కోల్పోయారు. దీంతో ఆటో డ్రైవర్లు మహాలక్ష్మి పథకాన్ని రద్దు చేయాలంటూ ఆందోళనలు చేపట్టారు. ఉచిత బస్సు సౌకర్యంతో తాము ఉపాధి కోల్పోతున్నామని.. మహాలక్ష్మి పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తు బస్ భవన్ ను ముట్టడికి యత్నించారు. ఈక్రమంలో వారి పరిస్థితిని అర్థం చేసుకున్న సీఎం రేవంత్ వారితో సమావేశమయ్యారు. తమ సమస్యల్ని సీఎం రేవంత్‌కు వివరిస్తున్నారు. దీనిపై సీఎం ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో…వారికి ఎటువంటి భరోసా కల్పించనున్నారో వేచి చూడాలి.